Begin typing your search above and press return to search.

హాటీ అవతారంలో దంగల్ బ్యూటీ

By:  Tupaki Desk   |   17 April 2017 5:04 AM GMT
హాటీ అవతారంలో దంగల్ బ్యూటీ
X
దంగల్ మూవీతో తిరుగులేని విజయం సాధించిన ఆమిర్ ఖాన్.. నెక్ట్స్ ప్రాజెక్టుపై ఇప్పటికే దృష్టి పెట్టేశాడు. థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ పేరుతో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కొత్త సినిమా ప్రారంభం కానుండగా.. ఈ మూవీలో లీడ్ హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది. సడెన్ గా ఈ చిత్రానికి సంబంధించి.. దంగల్ మూవీలో ఆమిర్ కూతురుగా నటించిన ఫాతిమా సనా షేక్ ఫోటో ఒకటి ఆన్ లైన్ లోకి వచ్చేసింది.

దంగల్ చిత్రంలో గీతా ఫొగట్ పాత్రలో ఆకట్టుకున్న సనా.. ఇప్పుడు ఆమిర్ తో జోడీ కట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మోకాళ్ల వరకు కట్టు.. స్లీవ్ లెస్ టాప్ తో నడుం-నాభి అందాలు చూపిస్తూనే.. చేతిలో కత్తితో భయపెట్టేస్తోంది ఫాతిమా. యుద్ధానికి సిద్ధమైన యోధురాలి లుక్ లో దంగల్ బ్యూటీ మహా హాట్ గా ఉంది. గ్లామర్ లుక్ లోకి మారిపోయిన దంగల్ బ్యూటీ లుక్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రంలో.. ఈ పాత్ర కోసం కూతురుగా నటించిన ఫాతిమా సనా షేక్ పేరును ఆమిర్ స్వయంగా సూచించాడని అంటున్నారు.

అయితే.. ఈ పాత్రకు ఫాతిమానే ఖాయం చేశారని ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం ఈ రోల్ కోసం కత్రినా కైఫ్.. శ్రద్ధా కపూర్ లను కూడా పరిశీలిస్తున్నారు. అయితే.. లుక్ టెస్ట్ తర్వాత ఈ అంచనాలు మారుతున్నాయి. థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ లో హీరోయిన్ రోల్ ఈ దంగల్ బ్యూటీకే దక్కొచ్చని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/