Begin typing your search above and press return to search.

ప్రియురాలుగా మారిన కూతురు కేక

By:  Tupaki Desk   |   7 Jun 2017 6:25 AM GMT
ప్రియురాలుగా మారిన కూతురు కేక
X
2016 విడుదలైన దంగల్ సినిమా ఘనవిజయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో అమీర్ ఖాన్ నటనకు ఎంత పేరు వచ్చిందో.. అతడి కూతుర్లుగా చేసిన నలుగురు అమ్మాయిలకు అంతే గుర్తింపు వచ్చింది. సినిమాలో ఇద్దరు అమ్మాయిల కథ అయినా గీతా ఫోగాట్ పాత్ర మాత్రం బాగా హైలైట్గా నిలిచింది సినిమాలో. గీతా ఫోగాట్ గా చేసిన ఆ సంద్రమే ఇక్కడ ఉన్నపాల నురగల సుందరి ఫాతిమా సనా షేక్.

దంగల్ సినిమాలో నాన్నతో కాస్త పొసకని కూతురుగా నాన్న చెప్పినట్లు చేసి అతని అడుగుజాడలలో నడిచిన అమ్మాయిగా చాల చక్కగా నటించిన ఫాతిమా ఇప్పుడు ‘థగ్స్ ఆఫ్‌ హిందొస్తాన్’ సినిమాలో అమీర్ ప్రియురాలిగా నటిస్తోంది. కెరీర్ మొదలుపెట్టిన కొద్ది కాలంలోనే దంగల్ తో మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు కాస్త రూట్ మరిచినట్లు ఉందిలే. గ్లామర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథలే చేసిన హీరోయిన్లకే ఇక్కడ కాలం చెల్లుతుంది. అది గ్రహించి ఇప్పుడు తన యవ్వన పరువాలను ఆరబోయడానికి థగ్స్ ఆఫ్‌ హిందొస్తాన్ లో ఒక సెక్సీ హీరోయిన్ టైప్ లో అందాలను పరుస్తోందని ఇక్కడ ఆమె కొత్త ఫోటో షూట్ చూస్తే తెలుస్తోందిగా.

మొన్నటివరకు నేను గ్లామరసానికి చాలా దూరం అని చెప్పిన ఫాతిమా సనా షేక్ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవ్వాలంటే ఏం చేయాలో బాగా తెలుసుకుంది అంటూ ఈ ఫోటోలను చూసి బాలీవుడ్ గుసగుసలు పోతోందిప్పుడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/