Begin typing your search above and press return to search.

అమీర్ ఇప్పుడామెతో జ‌త క‌డుతున్నాడ‌ట‌

By:  Tupaki Desk   |   10 Jun 2017 3:47 AM GMT
అమీర్ ఇప్పుడామెతో జ‌త క‌డుతున్నాడ‌ట‌
X
వెండితెర ముచ్చ‌ట్లే వేరుగా ఉంటాయి. ఒక‌ప్పుడు మ‌న‌మ‌రాలుగా న‌టించిన న‌టిని కాల‌క్ర‌మంలో హీరోయిన్ గా చేయ‌టం మ‌ర్చిపోలేం. తండ్రితో జ‌త క‌ట్టిన న‌టి.. కొడుకుతోనూ జ‌త క‌ట్టిన వైనం గుర్తుండిపోయేదే. ఇప్పుడు అలాంటి కాంబినేష‌న్ ఒక‌టి బాలీవుడ్ లో క‌న్ఫ‌ర్మ్ అయి.. హాట్ టాపిక్ గా మారింది.

మ‌ల్ల‌యోధుడిగా అమీర్ ఖాన్ న‌టించిన దంగ‌ల్ బాక్స్ ఫీస్ ద‌గ్గ‌ర ఎంత మేజిక్ చేసిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ సినిమాలో అమీర్ తో పాటు అంద‌రి క‌న్ను ప‌డింది ఎవ‌రైనా ఉన్నారంటే.. ఆ చిత్రంలో అమీర్ పెద్ద‌కూతురిగా న‌టించిన ఫాతిమా స‌నా షేక్‌. డీ గ్లామ‌ర్ పాత్ర‌లోనూ ఆమె అందం.. న‌ట‌న అంద‌రిని ఆక‌ట్టుకునేలా చేసింది.

ఈ మ‌ధ్య‌నే బికినీ ఫోటో షూట్ తో ర‌సిక హృద‌యాల్లో మంట రేపిన ఈ ముద్దుగుమ్మ‌కు ఇప్పుడో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింద‌ని చెప్పాలి. అమీర్‌.. బిగ్ బీ అమితాబ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ చిత్రంలో ఠ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ లో ఛాన్స్ కొట్టేసిన ఈ భామకు తాజాగా మ‌రోసారి అమీర్ తో జ‌త క‌ట్టే అవ‌కాశం ల‌భించిన‌ట్లుగా చెబుతున్నారు.

సారే జ‌హాసె అచ్చా చిత్రంలో అమీర్ తో జోడీ క‌ట్టేందుకు ఆమెను ఫిక్స్ చేసిన‌ట్లు చెబుతున్నారు. దంగ‌ల్ లో అమీర్‌కు కూతురిగా న‌టించిన ఫాతిమా స‌నా.. ఈసారి ఏకంగా ఆయ‌న భార్య‌గా న‌టించ‌టం ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. ఠ‌గ్స్ లో అమీర్‌తో ఫాతిమాకు రొమాంటిక్ స‌న్నివేశాలు ఉన్నాయ‌ట‌. మ‌రి.. కూతురిగా న‌టించిన అమ్మాయితో అమీర్ ఎలాంటి రొమాన్స్ చేశార‌న్న‌ది వెండి తెర మీద‌నే చూడాలంటున్నారు. మొత్తానికి ఏదో విష‌యం మీద త‌ర‌చూ వార్త‌ల్లోకి ఎక్కేయ‌టం ఫాతిమా స‌నాకు ఈ మ‌ధ్య‌న ఎక్కువైంద‌న్న మాట వినిపిస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/