Begin typing your search above and press return to search.

పాకిస్తాన్‌ బాబు.. వాటే ఓవరాక్షన్‌

By:  Tupaki Desk   |   9 March 2016 4:16 AM GMT
పాకిస్తాన్‌ బాబు.. వాటే ఓవరాక్షన్‌
X
పాకిస్తాన్‌ నుండి ఇండియా వచ్చి సినిమాల్లో స్టార్లు అయిపోదాం అని చాలామందే ఆశలు పడి కలలుకంటుంటారు. కాని అదృష్టం మాత్రం కొందరినే వరిస్తుంది. అలా వరించిన వారిలో ఫవాద్‌ ఖాన్‌ ఒకడు. అయితే మనోడు ఏదో పెద్ద అందగాడు.. విపరీతమైన వెర్సటైల్‌ నటుడు ఏం కాదులే కాని.. ఏదో పర్లేదు. సోనమ్‌ కపూర్‌ తో చేసిన ''కూబ్సూరత్‌'' సినిమాతో బాలీవుడ్‌ లో వరల్డ్‌ ఫ్యామస్‌ అయ్యాడు. కాని ఇతగాడి రూల్సూ గట్రా ఉంటాయండీ.. అబ్బో.. వేసవి కాలంలో నాలుకు ఎండిపోతుంటే.. అప్పుడే కరక్టెగా కారంతో మాడ్చిన చేప ముక్క ఒకటి నోట్లో పెట్టినట్లు ఉంటాయ్‌.

మనోడు సినిమాల్లో పెదాల ముద్దులు పెట్టడు. ఓకె. అలాగే తన ప్రక్కన కనిపించే హీరోయిన్లు అస్సలు ఎక్సపోజింగ్‌ కూడా చేయకూడదట. అందుకే త్వరలో విడుదల కాబోతున్న కపూర్‌ అండ్‌ సిన్స్‌ సినిమాలో మనోడి ప్రక్కన ఎప్పుడు కనిపించినా ఆలియా భట్‌ దాదాపు పూర్తి కవరింగ్‌ ఉన్న డ్రస్సులే వేసుకుంది. అంతేకాదు.. కొత్త ఫిలింఫేర్‌ ఎడిషన్‌ కోసం ఫోటోషూట్‌ చేసిన ఫవాద్‌.. ఆలియో బికినీ వంటి అవుట్‌ ఫిట్లతో తన ప్రక్కన కనిపించకూడదంటూ కండిషన్‌ పెట్టాడు. అందుకే ఆమె సోలో ఫోటోల్లో అందాలు ఆరబోసి.. కపుల్‌ ఫోటోస్‌ లో కవర్‌ చేసుకుంది. ఇంతకీ ఎందుకు ఇతగాడి అతి?? అబ్బే.. పాకిస్తానీయుల మనోభావాలు.. అలాగే తన మతానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతింటాయట.

అలాంటప్పుడు అసలు ఇక్కడ సినిమాల్లో ఎందుకు నటించడం రాజా? ఫిలింఫేర్‌ షూట్‌ లో ఈ రేంజులో ఆలియా పక్కనే ఓవరాక్షన్‌ చేసినా కూడా.. బాలీవుడ్‌ లోని కొందరి పెద్దల అండ కారణంగా ఇతగాడి చేతిలో ఇంకా రిలీజవ్వాల్సినవి 6 సినిమాలున్నాయి.