Begin typing your search above and press return to search.

జగపతి బాబు నాట్ 60.. నాటీ 16

By:  Tupaki Desk   |   26 Dec 2020 7:44 PM IST
జగపతి బాబు నాట్ 60.. నాటీ 16
X
జగపతిబాబు అంటే ఒకప్పుడు ఫ్యామిలీ హీరో. కొంత కాలం నటనకు గ్యాప్ ఇచ్చిన ఈ హీరో.. సెకండ్ ఇన్నింగ్స్ లో భయంకరమైన విలన్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. జగ్గూభాయ్ కమ్ బ్యాక్ మూవీకి గ్రాండ్ వెల్కం చెప్పారు ఆడియన్స్. కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో ఓ చిత్రం రూపొందుతోంది. FCUK (ఫాదర్, చిట్టి, ఉమా, కార్తీక్) పేరుతో విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. అయితే.. ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్లు రిలీజ్ చేస్తున్న యూనిట్.. ఇటీవల మూవీ పేరు మాత్రమే ఉన్న పోస్టర్ విడుదల చేసింది. తాజాగా.. జగపతి బాబుతో ఉన్న పోస్టర్ విడుదల చేశారు. ఈ మూవీలో జగపతి బాబుతోపాటు ‘కార్తీక్, అమ్ము అభిరామి’ యువ జంటగా నటిస్తున్నారు.

‘#60 బట్ 16’ అనే ట్యాగ్ లైన్ తో రిలీజ్ చేసిన జగపతి బాబు పోస్టర్ వైరల్ గా మారింది. ‘అరవై ఏళ్ల వ్యక్తి అయినప్పటికీ.. పదహారేళ్లే’ అంటూ పోస్టర్ రిలీజ్ చేయడంతో ఆడియన్స్ అటెన్షన్ తమవైపు తిప్పుకున్నారు మేకర్స్. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని.. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి బీమ్స్ సిసిరొలియా సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలో థియేటర్లలోనే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.