Begin typing your search above and press return to search.
బంధుప్రీతి వలన కొత్తవాళ్లకు అవకాశాలు రావడం కష్టం: ప్రముఖ హీరోయిన్ వ్యాఖ్యలు
By: Tupaki Desk | 18 July 2020 3:50 PM GMTదివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య పై సినీ అభిమానుల నుండి సెలబ్రిటీల వరకు అంతా సంతాపం తెలిపారు. అసలు మంచి కెరీర్ ఉన్న సుశాంత్ అలా ఎందుకు చేశాడా.. అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కానీ సుశాంత్ మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోని చీకటి కోణాలన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఇండస్ట్రీలో బంధుప్రీతి ఉందని సోషల్ మీడియాలో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో వారసులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు కొందరు గుప్పిస్తుండగా.. తాజాగా నెపోటిజం పై హీరోయిన్ శ్రద్ధాదాస్ స్పందించింది.
నేపోటిజం లేకపోతే సమాజమే లేదని చెప్పిన రాంగోపాల్ వర్మకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందని అంతా అంటున్నారు. కానీ శ్రద్దా చేసిన కామెంట్లు ఎవరిని ఉద్దేశించినవో పక్కాగా చెప్పలేం. అవి వర్మకు ఆమె మాటలు పూర్తి విరుద్దంగా ఉన్నాయి. అసలు శ్రద్దా ఏమని స్పందించిందంటే.. "ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ బంధుప్రీతి పై నడుస్తున్న చర్చలు చూసి విసుగొస్తుంది. పైగా ప్రతీ రంగంలోనూ అలానే ఉంటుందని మాట్లాడుతున్నారు. తల్లీదండ్రులు వారి వారసత్వాన్ని కొడుకులకు ఇస్తారని చెబుతున్నారు. ఒకవేళ మా పేరెంట్స్ డాక్టర్లు, ఇంజనీర్లు అయితే.. పరీక్షలు లేకుండా డైరెక్ట్‌గా డాక్టర్ లేక ఇంజనీర్ అవ్వగలనా? అని ప్రశ్నించింది.
ప్రతీ ఒక్కరికీ అవకాశాలు వస్తాయి. అందులోను బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి రెడ్ కార్పెట్ పరిచి మరీ ఛాన్స్ ఇస్తారు. అదే కొత్తవారైతే ఎన్నో పాట్లు పడాలని శ్రద్దా చెబుతోంది. పెద్ద సినిమాలో ఛాన్స్ రావాలంటే.. పేరున్న డైరెక్టర్లను కలవాలంటే కొత్తవాళ్లకు ఎంతో కష్టం" అని బంధుప్రీతికి వ్యతిరేకంగా శ్రద్దా స్పందించింది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో బంధుప్రీతి అనేది ఉంటేనే సమాజానికి మంచిది అన్నట్లు మాట్లాడిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి ఈ కౌంటర్లు వర్తిస్తాయని సినీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. మరి శ్రద్ధ ఎవరినైనా టార్గెట్ చేసి చెప్పిందా.. లేక తన మనసులో మాటలు చెప్పిందా.. ఓ విధంగా ఆమె చెప్పింది నిజమే అంటున్నారు కొందరు నెటిజన్లు.