Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ నుంచి జక్కన్న ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా?
By: Tupaki Desk | 23 May 2021 2:30 AM GMTటాలీవుడ్ లో అగ్ర సినీకుటుంబాల నుంచి ఇద్దరు పెద్ద స్టార్లను కలిపి భారీ పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు రాజమౌళి. రామారావు-రామ్ చరణ్ ని కలిపి ఆర్.ఆర్.ఆర్ సినిమా తీయాలన్న ఆలోచనే ఒక పెద్ద సవాల్. ఆ ఇరువురికి ఉన్న భారీ మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా ప్రతిదీ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. సోషల్ మీడియా యుగంలో ప్రతిదీ డిబేటబుల్ మెటీరియల్ గా మారుతోంది. ఇక ఆర్.ఆర్.ఆర్ విషయంలో రాజమౌళి ఏ చిన్న పొరపాటు చేసినా దానిని ఎత్తి చూపేందుకు సదరు స్టార్ల అభిమానులు సిద్ధంగా ఉంటారు.
అయితే అభిమానుల నుంచి ఒత్తిళ్లను ఎదుర్కొనేంత సత్తా రాజమౌళికి ఉంది. ఆ ఇద్దరి పాత్రల్ని సమానంగా తీర్చిదిద్దడంలో ప్రతిదీ బ్యాలెన్స్ చేయడంలో అతడి నిబద్ధత గురించి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇక ప్రచారం ఎత్తుగడలోనూ ఆ ఇరువురిని సమానంగా చూపించేందుకు ఆయన ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే ఆయన ఎంత చేసినా కానీ ఇంకా అభిమానుల్లో ఏదో ఒక అసంతృప్తి బయటపడుతూనే ఉంది. సామాజిక మాధ్యమాల్లో అది స్పష్ఠంగా కనిపిస్తూనే ఉంది.
ఇక ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాన్ని సవ్యంగా రిలీజ్ చేయడంలో ఆయన ఎత్తుగడ ఎంతవరకూ సఫలమవుతుంది? అన్నది ట్రేడ్ ని ఆలోచింపజేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 900 కోట్ల మేర బిజినెస్ ని పూర్తి చేసింది. కేవలం శాటిలైట్-డిజిటల్ రైట్స్ కే జీ సంస్థ 325కోట్లు చెల్లించడం ఒక సంచలనం. థియేట్రికల్ రైట్స్ రూపంలో పలు భాషల నుంచి భారీ మొత్తాల్ని ఆర్జించారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయాలని జక్కన్న భావించారు. కానీ కొనసాగుతున్న మహమ్మారీ ప్రతిదీ మార్చేసింది. ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి గ్రాఫిక్స్ -వీఎఫ్ ఎక్స్ పనుల్ని పూర్తి చేసి దసరాకి రిలీజ్ చేయగలరా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ దసరా రిలీజ్ కుదరకపోతే రాజమౌళి 2022 సంక్రాంతిని టార్గెట్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువుడుతున్నాయి. అప్పటివరకూ ఆర్.ఆర్.ఆర్ కి హైప్ తగ్గకుండా కాపాడుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ రిలీజ్ ఆలస్యమైతే 2022 మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలబెట్టడంలో.. బాక్సాఫీస్ కింగ్ గా నిలబెట్టడంలో సఫలం కావాల్సి ఉంది.