Begin typing your search above and press return to search.

నిజమైన 'కళ'కు సత్కారం..!

By:  Tupaki Desk   |   1 Nov 2022 9:31 AM GMT
నిజమైన కళకు సత్కారం..!
X
విశ్వ ఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సినీ రాజకీయ నేతలకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ తో దాదాపు 80 సినిమాల్లో నటించిన సీనియర్ నటి ఎల్. విజయలక్ష్మికి తెలుగు సినీ పరిశ్రమ సమక్షంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అటెండ్ అయ్యారు. శతపురుషుడి.. శతాబ్ధి పురస్కారం అందుకున్న ఎల్. విజయలక్ష్మి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ వేడుకకు హాజరైన వారందరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు బాలకృష్ణ.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను జరపాలని ఒక కమిటీ ఏర్పాటుచేసి తనని గౌరవ అధ్యక్షుడిగా ఉండమని చెప్పారు.. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ ఫుల్ గా ముందుకు కెళ్తున్నవారికి తన కృతజ్ఞతలు తెలిపారు బాలకృష్ణ.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సినీ రాజకీయ నేతలను సత్కరించే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించిన వెటరన్ యాక్ట్రెస్ ఎల్. విజయలక్ష్మి ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి సన్మానించారు. నాన్న గారి మీద ఉన్న గౌరవంతో అమెరికా నుంచి వచ్చిన విజయలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు బాలకృష్ణ.

విజయలక్ష్మి గారి గురించి చెబుతూ.. ఎర్నాకులంలో పుట్టి పెరిగిన విజయలక్ష్మి సంప్రదాయ నృత్యాన్ని నేర్చుకున్నారు. 1959 నుంచి 1969 వరకు 100కి పైన సినిమాలు చేసిన విలయలక్ష్మి గారు 80 కిపైగా నాన్న గారితో సినిమాలు చేశారు. నటనతో పాటుగా నాట్యం పట్ల ఆమెకి అంకిత భావం ఉంది.

కొంతకాలం సినిమాల్లో రాణించిన ఆమె నాన్న గారి స్పూర్తితో ఉన్నత విద్య చదివారు. అమెరికా వెళ్లి అక్కడ మెట్రిక్యులేషన్, సీఏ చేసి వర్జీనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేస్తున్నారు. మహిళా సాధికారితకు ఆమె ప్రతికగా నిలుస్తూ భావితరాలకు విజయలక్ష్మి గారు ఆదర్శంగా నిలిచారని బాలకృష్ణ అన్నారు.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు.. ఇలానే శత జయంతి ఉత్సవాలను ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నా అంటూ బాలకృష్ణ అన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.