Begin typing your search above and press return to search.

పెగ్గు మీద పెగ్గు లేపి గొడ‌వాడుకున్న పాపుల‌ర్ ఫీమేల్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు

By:  Tupaki Desk   |   25 Jan 2021 11:30 PM GMT
పెగ్గు మీద పెగ్గు లేపి గొడ‌వాడుకున్న పాపుల‌ర్ ఫీమేల్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు
X
టాలీవుడ్ లో పెగ్గేయ‌ని క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు ఎవ‌రూ లేర‌ని గుస‌గుస‌లు వినిపిస్తుంటాయి. ఇక్క‌డ ప‌బ్బులు క్ల‌బ్బుల్లో షికార్లు.. పార్టీలకు కొద‌వేమీ ఉండ‌దు. ఇక మేల్ ఆర్టిస్టుల సంగ‌తి ఏమో కానీ.. మ‌హిళా ఆర్టిస్టులు కొన్ని విష‌యాల్లో అస్స‌లు త‌గ్గ‌ర‌ని తెలిసింది.కొంద‌రైతే ఫుల్ బాటిల్ అలా సింపుల్ గా లేపేస్తార‌ట‌. పెగ్గు వేస్తే పెగ్గు మీద పెగ్గు వేయాల‌ని ... గ్రీన్ క‌ల‌ర్ లో ఉండే కొన్ని స్పెష‌ల్ బాటిల్స్ ని ఇంపోర్ట్ చేస్తుంటార‌ని కూడా ఒక మేల్ ఆర్టిస్ట్ ఇంత‌కుముందు చెప్పారు.

అదంతా స‌రే కానీ .. టాలీవుడ్ లో ఓ ఇద్ద‌రు ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు అటు పెద్ద తెర ఇటు బుల్లితెర రెండుచోట్లా పాపుల‌రైన ఆ ఇద్ద‌రూ కొన్నాళ్ల పాటు మందు పార్టీలో గొడ‌వ అవ్వ‌డంతో ఆ త‌ర్వాత మాట్లాడుకోవ‌డం మానేశారు‌. వెన‌క నుంచి గోతులు త‌వ్వే క్యారెక్ట‌ర్ అంటూ ఒక‌రినొక‌రు తిట్టేసుకోవ‌‌డంతో ఆ త‌ర్వాత ఈగోల వల్ల‌ ‌చాలా కాలం మాట్లాడుకోవ‌డం మానేశార‌ట‌. అయితే కాలం అన్నిటినీ మ‌రిపిస్తుంటుంది. ఇటీవ‌ల తిరిగి మాట‌లు కలిపేశారు. అక్క‌డితో ఆగారా అంటే ఆగ‌లేదు. పెళ్లిళ్లు ఫంక్ష‌న్లు పార్టీలు అంటూ క‌లిసే తిరుగుతున్నారు ఆ ఇద్ద‌రూ. పైగా ఛాన్స్ దొరికితే పెగ్గు మీద పెగ్గు లేపేస్తూ ఎంతో ఇదిగా క‌లిసిపోయార‌ట‌. ప్ర‌స్తుతం దీనిపై లోలోన గుస‌గుస‌లు వేడెక్కించేస్తున్నాయ్.