Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ లో టాలీవుడ్ తీన్ మార్

By:  Tupaki Desk   |   26 Aug 2017 5:30 PM GMT
ఓవర్సీస్ లో టాలీవుడ్ తీన్ మార్
X

టాలీవుడ్ ఓవర్సీస్ మార్కెట్ ని సెట్ చేసుకున్నప్పటి నుండి కేవలం స్టార్ హీరోస్ మాత్రమే వారి స్థాయిలో వసూళ్లను రాబట్టేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకుల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. టైమ్ ని డబ్బును ఏ మాత్రం వేస్ట్ చేయడానికి ఇష్టపడటం లేదు. చూసిన సినిమా కాస్త త్రిల్ ఇస్తే చాలు అనుకుంటున్నారు. ఈ మధ్య ఓవర్సీస్ లో కూడా ప్రవాసులు తెలుగు సినిమాలను తెగ ఇష్టపడుతున్నారు.

వచ్చిన సినిమా పెద్దదా లేదా చిన్నదా అనే వ్యత్యాసాన్ని చూడకుండా కంటెంట్ బావుంటే చాలు అనుకుంటున్నారు.అందుకు ఉదాహరణంగా రీసెంట్ గా వచ్చిన ఫిదా - నేనేరాజు మరియు నేనే మంత్రి మరియు ఆనందో బ్రహ్మ సినిమాలు సాక్ష్యంగా నిలిచాయి. శేఖర్ కమ్ములకి ముందు నుంచే ఓవర్సీస్ లో మంచి ఆదరణ ఉండడంతో దిల్ రాజు అక్కడ భారీగా రిలీజ్ చేశాడు. సినిమా టాక్ అదిరిపోవడంతో ప్రవాసులు సినిమాను తెగ చూసేశారు. ఆగస్టు 24 నాటికి ఈ చిత్రం రూ.13.14 కోట్లు 'నెట్' రాబట్టినట్లు ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు.

ఇదే తరహాలో ఎవరు ఊహించని విధంగా సొట్ట బుగ్గల సుందరి తాప్సి కూడా మంచి ఓవర్సీస్ కలెక్షన్స్ తో అదరగొట్టేసింది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఆనందో బ్రహ్మ సినిమా మొన్నటి వరకు 3.97 కోట్లను రాబట్టిందని తెలిపారు. అలాగే నేనే రాజు నేనే మంత్రి సినిమా కూడా మంచి వసూళ్లను రాబట్టి రానా కెరీర్ లో మంచి హిట్ ని ఇచ్చింది. 24వ తేదీ వరకు వచ్చిన లెక్కల ప్రకారం మొత్తం 2.25 కోట్లను కొల్లగొట్టిందని తరన్ ఆదర్శ్ వెల్లడించారు.