Begin typing your search above and press return to search.
సెన్సార్ టాక్: 'యు'తో ఫిదా చేస్తారంతే
By: Tupaki Desk | 14 July 2017 12:56 PM GMTఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు.. అదీ ముఖ్యంగా పెద్ద హీరోలు లేదా స్టార్ కిడ్స్ సినిమాలకు కూడా యు/ఎ రేటింగ్ ఎక్కువగా వస్తోంది. డబుల్ మీనింగ్ డైలాగుల కారణంగా.. హీరోయిన్ల అతి ఎక్సపోజింగ్ కారణంగాలో.. ఇప్పుడు సినిమాలను 'క్లీన్ యు' తెచ్చుకోవడానికి కాస్త కష్టపడుతున్నాయనే చెప్పాలి. కాని గంజాయి వనంలో తులసి మొక్క తరహాలో శేఖర్ కమ్ముల మాత్రం ఎప్పుడు 'యు' వచ్చే బొమ్మలే తీస్తాడు. దాన్నే తెప్పిస్తాడు కూడా.
అదిగో ఇప్పుడు ''ఫిదా'' సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయ్. ఈ సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చేశారు. మొత్తంగా సినిమా అంతటా కూడా ఎమోషన్స్ మీదనే ఎక్కువగా ఫోకస్.. ఒక ఇండిపెండెంట్ మహిళ పరస్పెక్టివ్ లో సినిమాను బాగా మలిచాడట శేఖర్. మొదటి ఆర్ధంలో సాయి పల్లవి సినిమాను తన భుజాలపై మేసేయగా.. ద్వితీయార్ధంలో వరుణ్ తేజ్ బాగా నడిపాడనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి క్లీన్ యు వచ్చింది కాబట్టి.. కట్టే ట్యాక్స్ కూడా తగ్గి.. దిల్ రాజుకు ఎక్కువ లాభాలు వస్తాయని ట్రేడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. కాకపోతే సినిమాకు రిలీజ్ నాడు ఎటువంటి టాక్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జూలై 21న విడుదలవ్వనున్న ఫిదా సినిమాను ఎంతో ప్రెస్టీజియస్ గా రూపొందించాను అని శేఖర్ కమ్ముల చెబుతున్నప్పటికీ.. కతలో వరుణ్ కు డౌట్లు ఉన్నాయంటూ.. క్లయమ్యాక్స్ సీన్ పేపర్ అర్ధంకాలేదంటూ.. ఆడియో ఫంక్షన్లో వాళ్ళు చేసిన కామెంట్లే సినిమామీద కొన్ని సందేహాలు క్రియేట్ చేసేశాయి. ఇంకో వారం ఆగండి.. అన్నీ నివృత్తి అయిపోతాయి.