Begin typing your search above and press return to search.

ఈ యాస అసలు అర్ధమవుద్దా??

By:  Tupaki Desk   |   17 July 2017 12:20 PM GMT
ఈ యాస అసలు అర్ధమవుద్దా??
X
ఒక్కోసారి కొన్ని పనులు ముందే చేస్తే బెటర్. కాని మనోళ్ళు చేయకూడనవి ముందు చేసి.. చేయాల్సినవి లేటుగా చేస్తుంటారు. అర్దంకాలేదా.. ఈ సినిమాల విషయానికొస్తే.. అసలు ముందు రిలీజ్ చేయాల్సిన ట్రైలర్ లేటుగా.. అసలు చేయకూడని ట్రైలర్ ముందుగా వస్తుంటాయి. అదిగో ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరక్షన్లో వస్తున్న ''ఫిదా'' విషయంలో గట్లనే అయితంది.

ఇప్పటికే వచ్చిన ''ఫిదా'' ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ.. ఏదో మిస్సయ్యిందనే ఫీలింగ్ మాత్రం ఉండిపోయింది. ఎందుకో ఒక పూర్తి స్థాయి లవ్ స్టోరీ చూస్తామా అనే ఫీలింగ్ మాత్రం రానే రాలేదు. అయితే ఇప్పుడు సడన్ గా మనోళ్ళు సెకండ్ ట్రైలర్ తో ఎంట్రీ ఇచ్చారు. సాధారణంగా ఈ మధ్యన ఏ తెలుగు సినిమాకు ఇలా సెకండ్ ట్రైలర్ అనే ఫీట్ చేయట్లేదు కాని.. ఇప్పుడు మాత్రం ఫిదా సినిమా వారు అసలు మొదటి ట్రైలర్ తో సంబంధం లేదన్నట్లు సెకండ్ ట్రైలర్ కట్ జేసిండ్రు. గిది బాగానే ఉందనే జెప్పాలి. ముఖ్యంగా పేమపాళ్ళు గిట్ల మస్తు వర్కవుటైనయ్.

కాకపోతే ఈ కొత్త ట్రైలర్ చూశాక ఒకటే డౌట్ వస్తోంది. ఈ ట్రైలర్లో సాయిపల్లవి క్యారక్టర్ మాట్లాడే తెలంగాణ యాస ఏదైతే ఉందో.. అది హైదరాబాద్లో ఉన్న అర్బన్ తెలంగాణ ఆడియన్స్ కే అర్ధంకావట్లేదు. ఇప్పుడది అసలు ఆంధ్రాలో ఎంతమందికి అర్ధమవుతుంది? సినిమా బాగుండీ డైలాగులు అర్ధంకాకపోతే ధియేటర్లకు జనాలు వస్తారా? అదే అతి పెద్ద టెన్షన్. ఏయ్ సప్పుడు గాకుండ్రీ.. ధియేటర్లకు బొమ్మొచ్చాక అసలు కథ ఎరుకైపోతుంది గదా!!