Begin typing your search above and press return to search.
షాక్: రామ్-లక్ష్మణ్ రిటైర్ మెంట్?
By: Tupaki Desk | 12 Sep 2018 4:29 AM GMTఆ ఇద్దరిలో రామ్ ఎవరు? లక్ష్మణ్ ఎవరు?.. గుర్తు పట్టమని అడిగితే అది అంత సులువేం కాదు. రెగ్యులర్ గా సినిమా వేదికలపై ఆ ఇద్దరినీ చూస్తున్నా - ఆడియెన్ ఎవరి పేరు ఏది.. అన్న మీమాంసలోనే ఉంటారు. ఒకే గెటప్.. ఒకే డ్రెస్.. ఒకే హెయిర్ స్టైల్.. ఒకే వేషం.. ఒకే స్టైల్ .. నడక నడత ప్రతిదీ ఒకే లుక్ .. . శ్రీరాముడు ఎవరు? లక్ష్మణుడు ఎవరు? అంటే వెంటనే గుర్తు పట్టి చెప్పేయొచ్చు కానీ - వీళ్లను మాత్రం ఠకీమని చెప్పడం చాలా కష్టం. ఆ రకంగా సినీ ప్రపంచంలో స్టంట్ మాష్టర్లుగా మాయ చేస్తున్న ఈ బ్రదర్స్ మన తెలుగు వాళ్లు. రామ్ - లక్ష్మణ్ అన్న పేరును ఎప్పటికీ విడివిడిగా చూడలేం. ఇంతకీ వీళ్లు సాధించిన ఘనకార్యం ఏంటి? అని ప్రశ్నిస్తే ...
టాలీవుడ్ సహా సౌతిండస్ట్రీ - బాలీవుడ్ కలుపుకుని ఇప్పటికి వీళ్లు ఏకంగా 1100 సినిమాలకు ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేశారు. ప్రపంచంలో వేరొక స్టంట్ డైరెక్టర్ కి రాని అరుదైన ఛాన్స్ ఇదని చెప్పాలి. 2001లో కెరీర్ జర్నీ ప్రారంభించి కేవలం ఈ 18 సంవత్సరాల్లో ఈ కవల సోదరులు సాధించిన ఘనత ఇదనడంలో సందేహం లేదు. ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్స్ గా ఐదు సార్లు నంది అవార్డులు అందుకున్న రామ్ -లక్ష్మణ్ ఈరోజుకీ నెత్తికి గర్వం ఎక్కించుకోని వారిగా మంచి మనుషులుగా పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం ఈ ఇద్దరూ టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ `సైరా-నరసింహారెడ్డి` - `మహార్షి` చిత్రాలకు ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అందరు అగ్రకథానాయకుల సినిమాలకు పని చేశారు. రియల్ స్టార్ శ్రీహరి ప్రోత్సాహంతో ఎదిగిన స్టంట్ మాస్టర్లు వీళ్లు. అయితే అంతటి గొప్ప గ్రాఫ్ ఉన్న మన మాస్టర్లు ఊహించని రీతిలో షాకిస్తూ ఇక ఈ రంగం నుంచి తొందర్లోనే రిటైర్ మెంట్ ప్రకటించేస్తున్నామని అన్నారు. ఈ వృత్తిని వదిలి తిరిగి తమ సొంత విలేజ్ కి వెళ్లిపోతామని తెలపడం సంచలనమైంది. ఏపీ గోదావరి జిల్లా- మండపేటలోని ఓ కార్యక్రమానికి వెళ్లిన రామ్ - లక్ష్మణ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. అందరికీ నిరాశ కలిగించే వార్త ఇది.