Begin typing your search above and press return to search.

ఫైట‌ర్ బ్యూటీ వెరైటీ యోగా భంగిమ‌లు

By:  Tupaki Desk   |   7 Jan 2021 2:30 PM GMT
ఫైట‌ర్ బ్యూటీ వెరైటీ యోగా భంగిమ‌లు
X
స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 .. ఖ‌లీ పీలీ లాంటి చిత్రాల‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని అల‌రించిన న‌ట‌వార‌సురాలు అన‌న్య పాండే. న‌టించిన రెండు సినిమాల‌తోనే యూత్ లో బోలెడంత ఫాలోయింగ్ సంపాదించుకుంది. న‌టుడు చుంకీ పాండే వార‌సురాలు కాబ‌ట్టి బాలీవుడ్ ఇన్ సైడ‌ర్ గా ట్రోల్స్ ని ఎదుర్కొంటోంది అన‌న్య‌.

అయితే ఇవ‌న్నీ రొటీనే అనుకుంటే ఈ భామ ఫైట‌ర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలిగిపోవాల‌ని క‌ల‌లు గంటోంది. అటు ఉత్త‌రాది స‌హా ఇటు సౌత్ లోనూ ఫైట‌ర్ భారీగా రిలీజ్ కానున్న నేప‌థ్యంలో అన‌న్య పేరు ఇక్క‌డా మార్మోగ‌డం ఖాయ‌మేన‌ని చెప్పొచ్చు. అయితే ఇటీవ‌ల పూరి-క‌ర‌ణ్ అండ్ టీమ్ ఫైట‌ర్ మూవీ తాజా షెడ్యూల్ గురించి వెల్ల‌డించ‌లేదు ఎందుక‌నో.

అన‌న్య ఈ మూవీ షూటింగులో తిరిగి జాయిన్ అయ్యిందా లేదా కూడా తెలియాల్సి ఉంటుంది. ఇక‌పోతే ఈ అమ్మ‌డు ఇత‌ర నాయిక‌లకు ధీటుగా ఫిట్నెస్ ఫ్రీక్ అన్న సంగ‌తి తెలిసిందే. నిరంత‌రం జిమ్ యోగా అంటూ తీవ్రంగానే హార్డ్ వ‌ర్క్ చేస్తోంది. ఇక ఫోటోషూట్ల‌కు ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌తో వేడెక్కించేస్తుంటుంది. తాజాగా త‌న గురువు స‌మ‌క్షంలో ర‌క‌ర‌కాల వెరైటీ యోగాస‌నాలు వేస్తూ అన‌న్య అగ్గి రాజేసింద‌నే చెప్పాలి. ఇవేవీ అంత సులువైన అసనాలు కావు. బాలీవుడ్ తార‌ల‌కు శిక్ష‌ణ‌నిచ్చే అన్షుక యోగాల‌యంలో అన‌న్య ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకుంటోంది. ఇక ఇటీవ‌లే మాల్దీవుల విహారం నుంచి ల‌వ‌ర్ బోయ్ ఇషాన్ ఖ‌త్త‌ర్ తో క‌లిసి తిరిగి వ‌చ్చిన సంగ‌తి తెలిసిన‌దే. దీనిపై ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం వేడెక్కించింది. అనన్య తదుపరి ఫైట‌ర్ చిత్రంతో పాటు.. శకున్ బాత్రా మూవీలోనూ న‌టిస్తోంది.