Begin typing your search above and press return to search.
'సలార్' న్యూ రిలీజ్ డేట్... ఆ విషయం తెలిసే అనౌన్స్ చేశారా?
By: Tupaki Desk | 16 Aug 2022 7:30 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న సలార్ సినిమా ను వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా నిన్న చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. గతంలో అనుకున్న దానికి రెట్టింపు అన్నట్లుగా సినిమాను భారీగా చేస్తున్నారు.
సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. కేజీఎఫ్ 2 కు ముందు షూట్ చేసిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను మళ్లీ షూట్ చేయబోతున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. అభిమానులు సలార్ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో లేదా సమ్మర్ వరకు అయినా వస్తుందని ఆశిస్తే ఏకంగా సెప్టెంబర్ కు వాయిదా వేయడం చర్చనీయాంశంగా మారింది.
వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు సినిమా కోసం వెయిట్ చేయాల్సిందేనా అంటూ అభిమానులు నిటూర్చుతున్నారు. ఈ సమయంలోనే మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్.. దీపిక పదుకునే జంటగా కమర్షియల్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫైటర్ సినిమా ను కూడా అదే తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.
కొన్ని వారాల క్రితం ఫైటర్ సినిమా ను సెప్టెంబర్ 28, 2023 లో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు అదే తేదీన సలార్ ను విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రకటించిన నేపథ్యంలో ఏం జరగబోతుంది అనే ఆసక్తి అందరిలో కూడా కనిపిస్తోంది.
సలార్ సినిమా కు కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ తో సినిమా కేజీఎఫ్ 2 కి మించి భారీ ఎత్తున విడుదల అవ్వనుంది ఇక వసూళ్లు మినిమం వెయ్యి కోట్లు అన్నట్లుగా మేకర్స్ లెక్కులు వేసుకుంటూ ఉంటారు. కనుక అదే సమయంలో ఫైటర్ సినిమా విడుదల అవ్వడం వల్ల కచ్చితంగా బాలీవుడ్ లో డ్యామేజీ తప్పక పోవచ్చు.
హృతిక్ రోషన్ కు బాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం కాదు. అందుకే ఆయన సినిమాకు పోటీ అంటే సలార్ తప్పు చేస్తున్నట్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఫైటర్ విడుదల తేదీ గురించి తెలిసే సలార్ కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేసి ఉంటారా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.