Begin typing your search above and press return to search.
'బాలీవుడ్'కి మరో షాక్.. ప్రముఖ నిర్మాత మృతి!
By: Tupaki Desk | 1 May 2020 8:30 AM GMTదేశంలో కరోనా మరణాల విజృంభణతో పాటు బాలీవుడ్ లో కూడా స్టార్ల మరణాలు వరుస కట్టాయి. ఇప్పటికే ఇర్ఫాన్ ఖాన్ - రిషి కపూర్ ల మరణాలు మరువక ముందే మరో ప్రముఖ నిర్మాత - టెలివిజన్ అండ్ గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవో కుల్మీత్ మక్కర్ మరణం బాలీవుడ్ ని కలచివేస్తుంది. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుల్మీత్ శుక్రవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. లాక్‌డౌన్ విధించక ముందు ఇంటి పట్టునే ఉన్న కుల్మీత్ గుండెపోటుకు గురై అప్పటినుంచి ధర్మశాలలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మరణం పై బాలీవుడ్ నటి విద్యాబాలన్ - ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ - దర్శకులు హన్సల్ మెహతా - సుభాష్ గాయ్ తదితరులు ట్విట్టర్ లో నివాళులర్పించారు.
నటి విద్యాబాలన్ స్పందిస్తూ.. ‘షాకింగ్ న్యూస్. ఇండస్ట్రీకి మీరు అందించిన సేవలు ఎప్పటికి గుర్తుంచుకుంటాం. మా కన్నీటితో ఇవే మీకు మా ఘన నివాళులు. నా తరపున మీ కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ స్పందిస్తూ.. ‘ ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ సీఈవోగా మీరు నిస్వార్థ సేవలందించారు. పని పట్ల మీకున్న విశ్వసనీయతను ఎల్లప్పుడు గుర్తుంచుకుంటాం. అలాంటి మీరు మమ్మల్ని వదిలి పెట్టి వెళ్లడం చాలా బాధాకరం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. అసలు బాలీవుడ్ కు ఏమైందని.. అందరూ వాపోతున్నారు. వరుస విషాదాలు ఇండస్ట్రీని వెంటాడుతున్నాయి. కుల్మీత్ మక్కర్! మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అంటూ దర్శకుడు హన్సల్ మెహతా తెలిపారు. ఇలా సినీ ప్రముఖులంతా కుల్మీత్ మరణం పై కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.