Begin typing your search above and press return to search.
ఇంట్లోనే సెలబ్ జిమ్.. కరోనా తెచ్చిన తంటా!
By: Tupaki Desk | 20 March 2020 3:30 AM GMTకరోనా వల్ల నష్టంతో పాటు కొంత మేలు కూడా జరుగుతోందట. ముఖ్యంగా ఎప్పుడూ షూటింగులు.. జిమ్ములు యోగాలు అంటూ బయట తిరిగే సెలబ్రిటీలు అంతా ఇంటికే అంకితమై ఇళ్లలోనే వీటన్నిటినీ కానిచ్చేస్తున్నారని తెలుస్తోంది. యోగా.. జిమ్ ప్రతిదీ ఇంట్లోనే ఇప్పుడు. ఇక ఇన్నాళ్లు ఇంటి బయటి నుంచి తామేం చేస్తున్నారో ఆ ఫోటోలు.. వీడియోల్ని షేర్ చేసుకున్నారు. ఇకపై సొంత ఇంటి నుంచే తమ యాక్టివిటీస్ కి సంబంధించిన విషయాలను ప్రతిదీ షేర్ చేసుకోవడం చూడబోతున్నాం అన్నమాట.
అయితే ఈ సన్నివేశం ఎందుకని వచ్చింది? అంటే .. బయట జిమ్ లు.. ఫిట్ నెస్ సెంటర్లతో పాటు యోగా సెంటర్లను మూసివేయడమే కారణం అని తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రమాదకర రీతిలో వ్యాపిస్తుండడంతోదానిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాలు బహిరంగ సభలు .. జిమ్ లు మూసివేయడం వలన ఈ తరహా సమస్య తప్పడం లేదు. సెలబ్రిటీలు ఇళ్లలోనే ఫిట్ నెస్ కోసం కుస్తీలు పడుతున్న చిత్ర విచిత్రాల్ని ఫోటోలు వీడియోల రూపంలో పంచుకుంటున్నారు. వీటిని చూస్తే చాలా మంది కామన్ జనం సైతం ఇంట్లోనే యోగా వ్యాయామం చేస్తున్నారు.
కత్రిన.. కరీనా లాంటి స్టార్ హీరోయిన్లు మాత్రమే కాదు.. చోటా మోటా నటీమణులు .. మిడ్ రేంజ్ స్టార్లు కూడా తమ ఇంటిని వర్కౌట్ ప్రదేశంగా మార్చి ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. స్టార్ల జీవనశైలిలో ఈ రకమైన అభివృద్ధి స్ఫూర్తిదాయకమే. సెలబ్రిటీల వల్ల సాధారణ ప్రజలకు ఫిట్ నెస్ గోల్స్ ఏర్పడతాయనడంలో సందేహం లేదు. అయితే కరోనాకి భయపడి ఇలా చేయడం సరికాదు. ఏదీ లేకపోయినా ఉన్నా ఫిట్ నెస్ కోసం శ్రమించే వాళ్లే ఆల్వేస్ గ్రేట్.