Begin typing your search above and press return to search.
ఖద్దరు ప్రపంచంలో స్టార్స్ మెరుపులు!
By: Tupaki Desk | 3 Nov 2017 5:04 PM GMTదక్షిణాదిలో రాజకీయం రంగు రుచి వాసన మారబోతున్నాయి. కేవలం ఖద్దరు మాత్రమే కాదు.. రంగుల ప్రపంచం హంగులన్నీ రాజకీయానికి అంటుకోబోతున్నాయి. వెండి తెర మీద తళుకులీనే తారలు.. జనం మధ్యకు వచ్చి ఇక్కడ మెరవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీలు ప్రారంభించిన వారు కొందరు, జస్ట్ శ్రీకారం దిద్దిన వారు కొందరు - పెట్టడానికి సిద్ధమవుతున్న వారు కొందరు - పెట్టాలని ఆలోచిస్తున్న వారు కొందరు - పార్టీతో నిమిత్తం లేకుండా రాజకీయ/సామాజిక అంశాలపై తమ గళం వినిపిస్తూ ప్రజలను చైతన్య పరచడం బాధ్యతగా భావిస్తున్న వారు కొందరు. అయితే తమాషా ఏంటంటే.. ఒక్క మళయాళ పరిశ్రమ మినహా.. తెలుగు - తమిళ - కన్నడ చిత్ర పరిశ్రమల నుంచి ఇప్పుడు ఏకకాలంలో.. ఇలాంటి రాజకీయాసక్తిని స్టార్స్ ప్రదర్శిస్తూ ఉండడం విశేషం.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. రజినీ పార్టీ పెడతారనే ప్రచారం గత కొన్నేళ్లుగా సా...గుతూనే ఉంది. అయితే కొంతకాలం నుంచి మాత్రం ఆయన ఈ పుకార్లకు బలం చేకూర్చేలా ప్రవర్తిస్తున్నారు. గత జులై నెలలోనే ఆయన పార్టీ ప్రకటన ఉంటుందని ఆయన సోదరుడు ప్రకటించారు గానీ.. అదేమీ పట్టాలెక్కలేదు. రజినీకాంత్ కు సహజంగానే ఉండే.. మీమాంస - సంశయాలు.. ఇంకా తొలగిపోలేదు. మనసులో మాత్రం రాజకీయాల్లోకి రావాలనే ఉంటుంది. కానీ ధైర్యం చిక్కదు. వస్తే రాజకీయాల్లో కూడా సూపర్ స్టార్ గా వెలుగొందడం సాధ్యమేనా? ఇప్పుడున్న ఇమేజి కాస్తా దెబ్బతినే దుస్థతి ఏర్పడుతుందా? అనేది ఒక భయం. ఇలా ఆయన ముందు వెనుకలాడుతున్నారు.
తెలుగునాట పవన్ కల్యాణ్... ఆల్రెడీ తన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టేశారు. గత ఎన్నికల సమయంలోనే ‘జనసేన’ పార్టీని ప్రారంభించిన ఆయన ఈ నాలుగేళ్ల వ్యవధిలో చాలా ప్రజాసమస్యలను ప్రస్తావించి.. ఒక నిర్దిష్టమైన పరిష్కారాలు వచ్చేదాకా గళం విప్పారు. పైగా ఆయన తనకున్న క్రేజ్ కు ముఖ్యమంత్రుల అభీష్టానికి - విధానాలకు నిమిత్తం లేకుండా.. తాను ఎంచుకున్న ప్రజాసమస్యల కోసం నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించగలుగుతున్నారంటే అతిశయోక్తి కాదు. రాబోయే 2019 ఎన్నికల్లో తన పార్టీని పూర్తిస్థాయిలో బరిలోకి దించడానికి పవన్ కసరత్తు ప్రారంభించారు. ఆయన కొన్ని వారాల కిందట ప్రకటించినట్టు రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర కూడా చేశారంటే గనుక.. ఇక పూర్తి స్థాయిలో.. రాజకీయపాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసినట్టే లెక్క.
కన్నడసీమలో ఉపేంద్ర ప్రస్తావన కీలకం. ఒక కోణంలోంచి చూసినప్పుడు దక్షిణాది హీరోల్లో పైన చెప్పుకున్న వాళ్లంతా రాజకీయాసక్తులతో ఉన్నా.. ముందుగా భవిష్యత్తు తేలబోయేది ఉపేంద్రదే. ఖాకీ చొక్కాలతో.. కార్మిక వర్గం - శ్రమశక్తికి నిదర్శనంగా తమ పార్టీ పనిచేస్తుందనే సంకేతాలతో ఉపేంద్ర తన సొంత పార్టీని ప్రకటించేశారు. ముక్కుసూటి తనానికి పేరుమోసిన హీరోగా ఉపేంద్ర రాజకీయ ప్రస్థానంలో కొన్నయినా ఆసక్తికర ఘట్టాలు తప్పక ఉంటాయని పలువురు అంచనా వేస్తున్నారు.
ఇక కమలహాసన్ గురించి చెప్పుకోవాలి. ఆయన పార్టీ పె ట్టడానికి సిద్ధంగానే ఉన్నారు. నేడో రేపో ఆ ప్రకటన కూడా రావొచ్చు. కానీ కమల్ హాసన్ తో ఓ చిక్కు ఉంది. ఆయనకు సొంతంగా అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని.. ఆయన సోదరుడు చారు హాసనే చెబుతున్నారు. మరి కమల్ తను పొత్తు పెట్టుకోగలిగినంత సచ్చీలురైన పార్టీగా ఎవరిని ఎంచుకుంటారు? అసలు తమిళనాట అంతటి సచ్ఛీలమైన పార్టీలు ఉన్నాయా? ఎవరితోనూ కలవకుండా స్వతంత్రంగా ఆయన మనుగడ సాగించగలరా? అభాసుపాలవుతారా? అనే అనుమానాలు పలువురిలో ఉన్నాయి. ఆయన సామాజికాంశాలను చాలా ఘాటుగా ప్రస్తావిస్తున్నా.. ఆయన చెబుతున్నంత నిజాయితీతో మ్యాచ్ అయి - ఆయనతో పొత్తు పెట్టుకోగల పార్టీ అక్కడ ఒకటి ఉంటుందని చెప్పలేం. ఈ లెక్కన ఆయన ప్రస్థానం ఎలా సాగుతుందో డౌటే.
ఇక తమిళనాడులోనే మరో హీరో విజయ్ కూడా రాజకీయ ఆలోచనలు చేస్తున్నారు. తాజాగా మెర్సల్ చిత్రంతో సృష్టించిన వివాదం కూడా చిన్నది కాదు. ఇది కేవలం సినిమా డైలాగుల వివాదంలా కాకుండా, రాజకీయ వివాదంగానే రూపుదాల్చింది. ఇక హీరో విశాల్ అయితే.. రాజకీయ పార్టీల ఊసెత్తలేదు గానీ.. తాను నడిగర్ సంఘం నాయకుడిగానే.. రెగ్యులర్ పొలిటీషియన్లకంటె ఎక్కువ సంచలనాలనే నమోదు చేస్తుంటారు. సామాజికాంశాలపై చైతన్యం ఆయనలో కూడా ఎక్కువ. మరొకరి గురించి కూడా తప్పక చెప్పోవాలి. బహుముఖ ప్రజ్ఞాశీలి ప్రకాష్ రాజ్ ఉన్నారు. ఆయన గ్రామాలను దత్తత తీసుకుని తన సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన కూడా రాజకీయాంశాలపై కామెంట్లు చేస్తుంటారు. స్పందిస్తూ ఉంటారు.
కీలకం ఏంటంటే...
రాజకీయ పార్టీలు పెట్టి ఎవరెవరు సక్సెస్ అవుతున్నారు. ఎవరెవరు ఫెయిల్ అవుతున్నారు అనే చర్చ ఈ దశలో అనవసరం. పైగా అందరికీ ఎన్టీఆర్ -ఎంజీఆర్ వంటి యోగం ఉండదు. మన కళ్ల ముందు మెగాస్టార్ ఉదాహరణ ఉండనే ఉంది. అయితే.. సంతోషం ఏంటంటే.. ఒక రకంగంలో (సినిమా) సెలబ్రిటీ స్టేటస్ కు వెళ్లిన వారు ఎంచక్కా దాన్ని అనుభవిస్తూ జీవితం వెళ్లదీసేయకుండా.. ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ.. ప్రజా జీవితంలోకి రావాలని అనుకోవడం, తమ ఆలోచనలను పదిమందిలోకి తీసుకువెళ్లాలని చూడడం శుభపరిణామం. పార్టీలో పెట్టిన పెట్టబోతున్న స్టార్ హీరోలు.. అందరూ సీఎంలు కానవసరం లేదు.. కనీసం కొంతశాతం ప్రజా సమూహంలో అయినా .. కొత్త స్వచ్ఛమైన ఆలోచనలకు వారు కారకులైతే.. వారి జీవితాలు ధన్యమైనట్లే లెక్క.