Begin typing your search above and press return to search.

అద్దంలో అందం క‌వ్వించేస్తోంది పో!

By:  Tupaki Desk   |   2 March 2020 11:19 AM GMT
అద్దంలో అందం క‌వ్వించేస్తోంది పో!
X
అందం ప్ర‌తిభ ఉంటే స‌రిపోదు.. అంత‌కుమించి ల‌క్ చిక్క‌క‌పోతే ఎంత అంద‌గ‌త్తె అయినా ఎంత మ‌ల్టీట్యాలెంటెడ్ అయినా కెరీర్ లో వెల‌గ‌లేరు. క‌వ్వింత తుళ్లింత కొన్నాళ్ల‌కే ప‌రిమితం కాబ‌ట్టి క‌థానాయిక‌లు ఇలా క‌నిపించి అలా తెర‌మ‌రుగైపోయే స‌న్నివేశం ఉంది.

అలా వ‌చ్చిన క‌థానాయిక‌నే అనైక శోఠి. ఈ అమ్మ‌డు ఆర్జీవీ డిస్క‌వ‌రీగా ప‌రిచ‌యమైంది. శ‌ర్వానంద్ స‌ర‌స‌న‌ సత్య 2లో న‌టించింది. అనైక‌ను ఇంట్ర‌డ్యూస్ చేస్తూ ఆర్జీవీ చేసిన ర‌చ్చ మామూలుగా అయితే లేదు. ముఖమైకం అంటూ ఓ స్పెష‌ల్ ఎక్స్ ప్రెష‌న్స్ కి సంబంధించిన వీడియోని అనైక‌తో రూపొందించి యూత్ కి ఎక్కించేందుకు ప్ర‌య‌త్నించాడు.

పేరుకు త‌గ్గ‌ట్టే అనైక సో సెక్సీ. వేడెక్కించే అందాల‌తో అమ్మ‌డు క‌వ్వించిన తీరుకు యూత్ ఫిదా అయిపోయారు. కానీ ఏం లాభం స‌త్య 2 ఆశించిన రిజ‌ల్ట్ ఇవ్వ‌లేదు. ఆ త‌ర్వాత సౌత్ లో అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలు వ‌చ్చినా కానీ కెరీర్ ప‌రంగా ఏమాత్రం ఎద‌గ‌లేదు. ఇక సోష‌ల్ మీడియాలో త‌న ఉనికిని చాటుకుంనేందుకు వ‌న్నె చిన్నెల వ‌య్యారాల వ‌డ్డ‌న‌ల‌తో నిరంత‌రం విరుచుకుప‌డుతూనే ఉంటుంది. అయినా ఈ అమ్మ‌డికి ఏమాత్రం ప‌న‌వ్వ‌డం లేదు. గ‌డిచిన ఆరేళ్ల‌లో ఐదే ఐదు చిత్రాల్లో న‌టించింది. స‌త్య 2- కావ్య త‌లైవ‌న్ - 365 డేస్- సెమ్మ బొత్త అగ‌త‌- కీ అనే చిత్రాల్లో న‌టించింది. ఆ త‌ర్వాత పూర్తిగా కెరీర్ డ‌ల్ అయిపోయింది. అయితే సోషల్ మీడియా క‌వ్వింత చూశాక అయినా అనైక‌కు క‌నీసం ఐటెమ్ నంబ‌ర్ ఛాన్స్ అయినా రాక‌పోవ‌డమే విడ్డూరం అని చెప్పాలి. తాజాగా అనైక షేర్ చేసిన ఫోటోలో అద్దంలో దోర అందాలు యూత్ ని క‌వ్విస్తున్నాయ‌నే చెప్పాలి.