Begin typing your search above and press return to search.
ఫిలిం సిటీ.. ఆమెకు ఇల్లు, అతడికి జిమ్
By: Tupaki Desk | 7 July 2015 7:29 AM GMT'బాహుబలి'లో రామోజీరావు పెట్టుబడి ఉందన్నది ఇప్పుడు బహిరంగ రహస్యం. కొన్ని రోజుల ముందైనా కొంచెం సందేహాలుండేవి కానీ.. గత కొన్ని రోజులుగా 'ఈనాడు' పత్రిక సినిమాను ప్రమోట్ చేస్తున్న తీరు చూస్తుంటే అందరూ కన్ఫమ్ అయిపోయారు.. 'బాహుబలి'కి బ్యాక్‌బోన్ రామోజీయేనని. ఎంత పెద్ద హీరోనైనా.. ఎంత పెద్ద దర్శకుడినైనా ఈనాడు ఇంటర్వ్యూ చేస్తే అర పేజీకి మించి స్పేస్ ఇవ్వరు. అలాంటిది ఎన్నడూ లేని విధంగా రాజమౌళి ఇంటర్వ్యూ ఒక ఫుల్ పేజీ ఇచ్చారు. ఆ తర్వాత కెమెరామన్ సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, హీరో రానా, విలన్ రానా దగ్గుబాటి.. తాజాగా తమన్నాతో భారీ ఇంటర్వ్యూలు ప్రచురించారు.
ఇక ప్రతి ఇంటర్వ్యూలోనూ కామన్‌గా కనిపించే పాయింట్ ఏంటంటే.. రామోజీ ఫిలిం సిటీ ముచ్చట. దీనికి సంబంధించి ప్రశ్న ఏమీ ఉండదు. వాళ్లంతట వాళ్లే ఫిలిం సిటీని తెగ పొగిడేస్తున్నారు. ఫిలిం సిటీనే గనక లేకుంటే ఈ సినిమానే ఉండేది కాదంటూ అందరిదీ ఒకటే మాట. ఫిలిం సిటీలో మొత్తం 110 ఎకరాల్లో ఒకేసారి తమ సినిమా వర్క్ జరిగిందని.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఈ సౌలభ్యం ఉందా అని రాజమౌళి అంటే.. ఇన్ని సదుపాయాలున్న స్టూడియోను ఇంకెక్కడా చూడలేదని సాబు సిరిల్ చెప్పాడు. రానా ఫిలిం సిటీ తనకు జిమ్‌లా ఉపయోగపడిందని చెబితే.. తమన్నా తనకు గత ఏడాదిగా అదే ఇల్లని అంది. మొత్తానికి బాహుబలి మీద పెట్టుబడి పెట్టడం ద్వారా ఒక లాభం అయితే.. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ఫిలిం సిటీకి ఫుల్ పబ్లిసిటీ వచ్చేస్తుండటం మరో లాభం. మొత్తానికి రామోజీ ఎత్తుగడలు మామూలుగా లేవు మరి!