Begin typing your search above and press return to search.
ఫిలింక్రిటిక్స్ అంతూ దరీ లేని వ్యథ!
By: Tupaki Desk | 4 April 2019 8:23 AM GMTదాదాపు 150-200 మంది జర్నలిస్టులు టాలీవుడ్ ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న సంగతి తెలసిందే. ఇందులో సుమారు 50 మంది ప్రింట్ మీడియా ప్రతినిధులు - 150 మంది ఈ-వెబ్ జర్నలిస్టులు ఉన్నారు. అయితే ఇటీవల ఫిలింక్రిటిక్స్ లో విచ్చలవిడి మీడియా ఆల్మోస్ట్ మీడియా డివైడ్ ఫ్యాక్టర్ కి కారణమైంది. ఆ క్రమంలోనే ఎలక్ట్రానిక్ మీడియా - వెబ్ జర్నలిస్టులు 150 మంది కలిసి న్యూస్ టెలీకాస్టర్స్ అసోసియేషన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో సుప్తావస్థలో ఉన్న ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ ని తిరిగి యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. న్యూస్ టెలీకాస్టర్స్ పుణ్యమా అని వీళ్లలో్ కొంత వరకూ కదలిక రావడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక 10-15 ఏళ్లుగా ఫిలింజర్నలిస్టుగా ఉండీ ఏ అసోసియేషన్ లోనూ సభ్యత్వం లేకుండా నిర్జీవంగా పడి ఉన్న ఫిలింజర్నలిస్టుల మాటేమిటి? ప‌్రస్తుతం ఉన్న 10-12 దిన పత్రికల్లో ఉన్న ప్రింట్ జర్నలిస్టుల్లో తలెత్తిన ప్రశ్న ఇది. వీళ్లు న్యూస్ కాస్టర్ కి చెందరు. ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ లో సభ్యులు కారు. అలాంటి సందిగ్ధంలో దేనికీ కొరగాకుండా పో్తున్నామనే వ్యథ వీళ్లలో ఉంది.
ప్రస్తుతం వీళ్లంతా న్యూస్ కాస్టర్స్ లో కలిసేందుకు సన్నద్ధమవుతున్నారు. పదేళ్లుగా జర్నలిస్టులుగా అనుభవం ఉన్న కొందరు జర్నలిస్టులు న్యూస్ కాస్టర్స్ లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఇలా ఎవరైనా గ్రూప్ గా వస్తే చేర్చుకునేందుకు ఆసక్తిగా ఉన్నామని న్యూస్ కాస్టర్స్ తెలిపారు. ఇరువురి మధ్య చర్చలు సాగించేందుకు సన్నాహాలు సాగుతున్నాయని తెలుస్తోంది. తుమ్మినా దగ్గినా ఉద్యోగాలు ఊడే ఇండస్ట్రీలో్ సినీజర్నలిస్టుల జీవితాలకు భరో్సా కావాలి. హెల్త్ కార్డ్ .. మెంబర్ గా గుర్తింపు కోసం సాగించే పాకులాట ఇది. 10-15 ఏళ్ల అనుభవజ్ఞులైన జర్నలిస్టులు ఎందుకూ కూడా కొరగాకుండా పోయే ధైన్యం నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నంగా దీనిని చెబుతున్నారు. ఇక కొందరు స్వార్థపూరితమైన వాళ్ల చేతిలో ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సుప్తావస్థలో ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో కొత్త మెంబర్స్ ని చేర్చుకోకుండా పబ్బం గడపడంపైనా తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక ఫిలింక్రిటిక్స్ సుప్తావస్థలో ఉందా? దానిని పునరుద్ధరిస్తారా లేదా? అన్నది తర్వాతి ఆర్టికల్ లో... టిల్ దెన్.. వెయిట్ & వాచ్ దిస్ స్పేస్...