Begin typing your search above and press return to search.
దిల్ రాజు కిల్ రాజుగా మారాడంటూ ఆవేదన!
By: Tupaki Desk | 14 Jan 2021 6:30 AM GMTసంక్రాంతి రిలీజ్ లకు ఎప్పుడూ పోటీనే. ఈసారి కరోనా క్రైసిస్ భయాందోళనలు ఉన్నా పండగ రిలీజ్ ల విషయంలో ఎవరూ తగ్గలేదు. ఒకదాని వెంట ఒకటిగా వరుసగా నాలుగు సినిమాలు రిలీజవ్వడం పోటీని పెంచింది. అయితే ఈసారి సంక్రాంతి పోటీలో రిలీజైన తొలి చిత్రంగా క్రాక్ రికార్డులకెక్కింది. ఈ సినిమా వసూళ్ల పరంగా ఆల్మోస్ట్ సేఫ్ జోన్ కి చేరుకుంటోందని టాక్ ఉంది. నైజాం సహా అన్నిచోట్లా చక్కని షేర్ వసూళ్లతో మాస్ రాజా కెరీర్ లో చక్కని విజయంగా మారబోతోందన్న టాక్ నడుమ తాజాగా ఓ వివాదం హాట్ టాపిక్ గా మారింది.
ఈ సంక్రాంతిబరిలో మాస్టర్ - RED - అల్లుడు అదుర్స్ చిత్రాలను పంపిణీ చేస్తున్న దిల్ రాజు తన సినిమాల కోసం క్రాక్ ని ఆడనివ్వకుండా కిల్ చేశారన్నది ఆయన ఆరోపణ.
కార్తికేయ డిస్ట్రిబ్యూటర్స్ వరంగల్ శ్రీను నిజాం ప్రాంతంలో రవి తేజ క్రాక్ ను విడుదల చేశారు. ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. కానీ మాస్టర్ కోసం దిల్ రాజు క్రాక్ స్క్రీన్స్ ని తగ్గించేశారట. అంతేకాదు క్రాక్ కి అంతగా ఉపయోగం లేని థియేటర్లను కేటాయించారని ఆయన ఆరోపించారు. అతను దిల్ రాజును కిల్ రాజు అని పిలిచేస్తూ ఆవేదన చెందాడు. బాగా ఆడుతున్నవాటిని దిల్ రాజు చంపేస్తున్నాడని ఆవేదన చెందారు.
సంక్రాంతికి బాగా ఆడితే తగినంత సంఖ్యలో స్క్రీన్లు ఇస్తామని దిల్ రాజు- శిరీష్ నాకు హామీ ఇచ్చారు. కాని వారు అలా చేయలేదు అని వరంగల్ శ్రీను అన్నారు. ఈ విషయంలో ఆ ఇద్దరినీ కలిసినా కానీ తనని అవమానించారని.. నేటి నుండి పంపిణీ కంటే దిల్ రాజుపైనే ఎక్కువ దృష్టి పెడతానని హెచ్చరించాడు.
క్రాక్ రిలీజ్ చేసిన నైజాం థియేటర్లలో బాగా ఆడుతున్నా.. తన సినిమా రిలీజ్ కోసం దిల్ రాజు కిల్ చేశారని పంపిణీదారుడు ఆరోపించారు.