Begin typing your search above and press return to search.
కోలీవుడ్ కి బాహుబలి2 పాఠాలు!!
By: Tupaki Desk | 9 May 2017 4:06 PM GMTదేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ప్రతీ చోటా బాహుబలి2 సెన్సేషనల్ వసూళ్లను రాబడుతోంది. అన్ని ఏరియాస్ లోనూ రికార్డ్ ఓపెనింగ్స్ ను సాధించినా.. తమిళనాడులో మాత్రం బాహుబలి2 తొలి రోజు రికార్డులను నమోదు చేయలేకపోయింది. ఇందుకు కారణం.. అసలు రిలీజ్ రోజున మాణింగ్ షోస్ పడకపోవడమే.
డిస్ట్రిబ్యూటర్లు పూర్తిగా డబ్బులు చెల్లించకపోవడంతో.. డిజిటల్ కీస్ ఇవ్వకుండా తమిళ నిర్మాతలు రిలీజ్ అడ్డుకున్నారు. ఈ సంఘటన కోలీవుడ్ నిర్మాతలకు మంచి పాఠాన్నే నేర్పింది. అందుకే ఇప్పుడు తమిళ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకున్నారు. వీటిని అందరూ పాటించాల్సిందే అంటూ హుకుం జారీ చేశారు. ఇకపై తమిళనాడులో 5 కోట్ల రూపాయల కంటే తక్కువ బడ్జెట్ ఉండే చిన్న సినిమాలను మాత్రమే.. కమీషన్ బేసిస్ పై విడుదల చేస్తారు. మిగిలిన ఏ సినిమాకి కూడా మినిమం గ్యారంటీ రూపంలో విడుదల చేయడం అనేది కుదరని పని.
మూవీ హక్కులను పూర్తిగా విక్రయించడం.. లేదా అడ్వాన్స్ పేమెంట్స్ ద్వారా రిలీజ్ చేయడం తప్ప.. ఒక సినిమాకి సంబంధించిన హక్కులను ఒకే డిస్ట్రిబ్యూటర్ కొనుగోలు చేయడం కూడా ఇకపై తమిళనాడులో జరగని పని. అంటే.. ప్రతీ ఏరియాకి డిస్ట్రిబ్యూటర్- ప్రొడ్యూసర్ మధ్య కనెక్షన్ తప్పనిసరి. అదే సమయంలో మినిమం గ్యారంటీ అనేది ఉండదు కాబట్టి.. నష్టాలు వస్తే కచ్చితంగా నిర్మాతకు కూడా భాగం ఉండి తీరుతుంది.
ఈ విధానం.. భారీ నష్టాల నుంచి డిస్ట్రిబ్యూటర్లను కాపాడేందుకు బాగానే ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. కోలీవుడ్ లో ఈ పాచిక పారితే.. పక్క ఇండస్ట్రీలకు వ్యాపించినా ఆశ్చర్యమేమీ లేదు. అప్పుడు భారీ చిత్రాలకు ఫ్యాన్సీ రేట్స్ ఇచ్చి కొనుగోలు చేసి.. తర్వాత తీరిగ్గా కోట్లు పోగొట్టుకుని ఏడవాల్సిన అవసరం ఎవరికీ ఉండదు.