Begin typing your search above and press return to search.
సినిమా సమ్మెకు వాళ్ల సపోర్ట్ కూడా!!
By: Tupaki Desk | 25 Jan 2018 10:07 AM GMTటాలీవుడ్ లో గత కొన్ని నెలలుగా సమ్మె మాట వినిపిస్తూనే ఉంది. మార్చ్ 1 నుంచి టాలీవుడ్ స్ట్రైక్ అంటూ చెబుతూనే ఉన్నారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల ఆగడాలు మితి మించిపోయాయని.. వారు వసూలు చేస్తూ ఛార్జీలను నిలువరించకపోతే.. మార్చ్ 1 నుంచి కొత్త సినిమాల షూటింగులు ఉండవని.. కొత్త సినిమాలు రిలీజ్ కావని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెబుతోంది.
ఇప్పుడు వీరి నిర్ణయానికి ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. జనవరి 31న జరనగున్న మీటింగ్లో ఈ సపోర్ట్ విషయాన్ని ప్రకటించబోతున్నాడు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ చెబుతున్నారు. ప్రస్తుతం నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్ల ప్రయోజనాలను పణంగా పెట్టి.. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు రాజ్యం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. నిర్మాతలు ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి సినిమాలు తీస్తుంటే.. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు వాటి ప్రదర్శనకు సంబంధించి సేవలు అందించాల్సి ఉంటుంది.
కానీ అడ్వర్టెయిజ్మెంట్స్ తో సహా అన్ని అంశాలు వారి చేతుల్లోనే ఉంటున్నాయని చెబుతున్నారు. వారికి సొమ్ములు ముడితే ఎలాంటి యాడ్స్ ను అయినా తగిలిస్తున్నారని.. కానీ నిర్మాతలు మాత్రం తమ తర్వాతి సినిమాల టీజర్లను ట్రైలర్లను కూడా సినిమాకు యాడ్ చేసేకుకోలేకపోవడం దారుణం అనే మాట వినిపిస్తోంది. ఈ యాడ్స్ రెవెన్యూలో కూడా నిర్మాతలకు వాటా ఉండాలన్నది కొంతకాలంగా వినిపిస్తున్న డిమాండ్.