Begin typing your search above and press return to search.
ఆస్కార్ అవార్డుకు రుద్రమదేవి?
By: Tupaki Desk | 11 Aug 2016 8:28 AM GMTఒక తెలుగు సినిమా ఆస్కార్ అవార్డులకు ఇండియా తరఫున నామినేట్ కావడం అన్నది అసాధారణమైన విషయం. కనీసం ఈ నామినేషన్లకు పరిశీలన కోసం వెళ్లడం కూడా గొప్ప విషయమే. ఈ ఘనత మన ‘రుద్రమదేవి’ సాధించింది. ఈ విషయం వెల్లడై సగం రోజు దాటిపోయినా.. ఇప్పటిదాకా అసలు చర్చే లేదు. ఈ సంగతే జనాలకు తెలియదు. ఇదే ఆశ్చర్యమైన విషయం. ‘రుద్రమదేవి’ ఆస్కార్ అవార్డుకు ఇండియా తరఫున ఎంట్రీ లిస్టులోకిగా ఎంపికైంది. ఈ విషయాన్ని ట్విట్టర్లో నిన్న రాత్రే దర్శక నిర్మాత గుణశేఖర్ ప్రకటించాడు. ఐతే ఇది నిజం కాదనుకున్నారో.. ఇగ్నోర్ చేశారో తెలియదు కానీ.. దీనిపై ఎక్కడా చర్చ అన్నదే లేదు.
ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్రం అని ఒక కేటగిరీ ఉంటుంది. ఆ విభాగానికి ఏటా ఒక సినిమాను ఇండియా తరఫున నామినేట్ చేస్తారు. అందుకోసం ముందు కొన్ని చిత్రాలను పరిశీలిస్తారు. ఆ పరిశీలనకు వెళ్లడం కూడా గొప్ప విషయమే. మన తెలుగు సినిమాలు అందుకు కూడా నోచుకోవు. గత ఏడాది ఇండియాలోని వివిధ భాషల్లో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. అందులో బాహుబలి, భజరంగి భాయిజాన్ లాంటి బ్లాక్‌బస్టర్లున్నాయి. మరి వాటి సంగతేంటో తెలియదు కానీ.. ‘రుద్రమదేవి’ ఇండియా తరఫున ఆస్కార్ అవార్డ్ ఎంట్రీ కోసం పోటీ పడుతోంది. ఐతే ‘రుద్రమదేవి’నే ఆస్కార్ ఎంట్రీకి ఫైనలైజ్ చేశారా లేదా అన్నది తెలియదు.