Begin typing your search above and press return to search.
హాలీ టు టాలీ.. తారల స్వర సౌందర్యం
By: Tupaki Desk | 18 Jun 2017 5:30 PM GMTహాలీవుడ్ నుంచి బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్.. ఇలాంటి తేడాలు లేకుండా ఇప్పుడు ఓ ట్రెండ్ తెగ స్పీడ్ గా ఊపందుకుంటోంది. స్టార్ యాక్టర్స్ గా వెలిగిపోతున్నవారు కూడా.. తమ స్వర మాధుర్యాన్ని.. పాటల ద్వారా శ్రోతలకు వినిపించేస్తున్నారు. తెరపై పెదాలు కదపడమే కాదు.. తెర వెనుక పాటలు పాడే బాధ్యత కూడా తామే చేసేస్తున్నారు.
హర్ చిత్రం కోసం స్కార్లెట్ జోహాన్సన్ పాడిన మూన్ సాంగ్ సూపర్ క్లిక్ అయింది. ది మాకింగ్ జే పార్ట్1 లో జెన్నిఫర్ లారెన్స్ స్వర సౌందర్యం అద్భుతం. బిగిన్ ఎగైన్ కోసం కీరా నైట్లీ తన స్వరాన్ని వినిపించింది. బాలీవుడ్ తారలు ఈ విషయంలో తక్కువేం కాదు. ప్రియాంక చోప్రా పాడిన ఇన్ మై సిటీ ఆల్బం సూపర్ హిట్ అయింది. ఏక్ విలన్ కోసం తొలిసారిగా శ్రద్ధా కపూర్ గాత్రం వినిపించింది. ఆ తర్వాత ఏబీసీడీ2.. బాఘీ చిత్రాల్లో తన కోసం తనే పాడేసుకుంది. హంప్టీ శర్మా కీ దుల్హనియాలో సంఝావన్ ట్రాక్ ను పాడి ఆలియా భట్ మెప్పించేసింది. ఇష్క్ హాలిక్ లో సోనాక్షి సిన్హా కూడా ఓ పాటేసుకుంది. మేరీ ప్యారీ బిందులో పరిణీతి చోప్రా పాట వినిపించింది.
హృతిక్ రోషన్.. అభయ్ డియోల్.. సల్మాన్ ఖాన్.. ఆమిర్ ఖాన్ కూడా ఇలా పాటలు మెప్పించేశారు. వారి సినిమాల కోసమే పాడినా.. ఈ ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అవడానికి కారణం.. కోలీవుడ్ హీరో ధనుష్ అని చెప్పచ్చు. వై దిస్ కొలవెరి దీ అంటూ సెన్సేషన్ సృష్టించేసిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. మాస్టర్ చిత్రం కోసం.. 'తమ్ముడూ అరె తమ్ముడూ' అనే ట్రాక్ ను.. మృగరాజులో 'చాయ్ చాయ్' అంటూ సాగే పాటను పాడేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత సీరియస్ గా పాటలు మొత్తం పాడిన హీరోగా ఎన్టీఆర్ ను చెప్పుకోవచ్చు. యమదొంగలో పాడిన ఎన్టీఆర్.. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో చిత్రంలో ఫాలో ఫాలో యూ అనేశాడు. కన్నడ యాక్టర్ పునీత్ రాజ్ కుమార్ కోసం కూడా ఓ పాట పాడాడు ఎన్టీఆర్.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాట పాడాడనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. వేదం చిత్రంలో 'ప్రపంచం నావెంట వస్తుంటే' అంటూ సాగే పాటను స్వయంగా పాడిన బన్నీ.. ఆ తర్వాత మళ్లీ పాడలేదు. పవన్ కళ్యాణ్ తమ్ముడు చిత్రంలోను.. అత్తారింటికి దారేది చిత్రంలో 'కాటమరాయుడా' పాటను పాడాడు. నిర్మలా కాన్వెంట్ కోసం నాగార్జున ఓ పాట పాడాడు. బలుపు చిత్రంలో 'కాజల్ చెల్లివా'.. పవర్ లో 'నోటంకీ నోటంకీ' పాటలు పాడాడు రవితేజ. రీసెంట్ గా గురు చిత్రం కోసం వెంకటేష్ 'జింగిడి జింగిడి' పాట పాడి మెప్పించేశాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/