Begin typing your search above and press return to search.
అతడే ఇప్పుడు సూపర్ మేన్ హీమ్యాన్ షో మ్యాన్!
By: Tupaki Desk | 11 July 2021 12:30 PM GMTబాలీవుడ్ టాలీవుడ్ లో గొప్ప ఇమేజ్ ఉన్న స్టార్ గా ఎదిగారు సోనూసూద్. అన్నిచోట్లా అతడికి వీరాభిమానులున్నారు. స్వయంకృషితో ఇంతింతై ఎదిగి తానేంటో నిరూపించాడు. అతడి పేరు నేడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. నటుడిగా సమాజ సేవికుడిగా అతడిని ప్రజలు ఆరాధిస్తున్నారు. కరోనాక్రైసిస్ కష్టకాలంలో ఒక సేవికుడిగా అతడు తన ఇమేజ్ ని అమాంతం పెంచుకున్నాడు.
ఇక తనకు పెరిగిన ఇమేజ్ ని ఏమాత్రం గాలికి వదిలేయడం లేదు సోనూసూద్. మరింతగా తన సేవల్ని విస్తరిస్తున్నాడు. ప్రాంతం భాషతో సంబంధం లేకుండా ఈ క్రైసిస్ లో సోనూసూద్ సేవలందించారు. తెలంగాణలోనూ పలువురికి ఆయన సేవలందాయి. ఇటీవలే కేటీఆర్ చేతుల మీదుగా ఒక జ్ఞాపికను అందుకున్న సోనూసూద్ ఉత్తమ హైదరాబాద్ వెజ్ బిర్యానీ తిన్నానని కేటీఆర్ ఆతిథ్యం ఎంతో గొప్పగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.
ఇంతలోనే ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీ ఫోటోషూట్ ని షేర్ చేయగా అది వైరల్ గా మారింది. రకరకాల డిజైనర్ లుక్స్ లో సోనూసూద్ షోమ్యాన్ లా ప్రత్యక్షమయ్యారు. ఫిలింఫేర్ ఇంటర్వ్యూలో సోనూ చాలా విషయాల్ని వెల్లడించారు. తన కెరీర్ ఆరంభం ఎలా జరిగిందో కూడా తెలిపారు. ``నా కలలను నెరవేర్చుకోవడానికి ముంబైకి రావడానికి లూధియానా నుండి `డీలక్స్ ఎక్స్ప్రెస్`లో ఎక్కిన రోజు నాకు ఇంకా గుర్తుంది. లూధియానా స్టేషన్ నుండి ఫిలింఫేర్ పత్రిక కొన్నాను. ఈ రోజు 20 సంవత్సరాల తరువాత నేను అదే పత్రిక ముఖచిత్రంలో ఉన్నాను. కలలను సాధించడం ఎప్పుడూ ఆలస్యం కాదని గ్రహించాను`` అని సోనూ వ్యాఖ్యను జోడించారు. తాజాగా ఫిలింఫేర్ లేటెస్ట్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.