Begin typing your search above and press return to search.

పునాదిరాళ్లు` డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ మృతి

By:  Tupaki Desk   |   15 Feb 2020 6:25 AM GMT
పునాదిరాళ్లు` డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ మృతి
X
మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం `పునాదిరాళ్లు` చిత్ర దర్శకుడు గుడిపాటి రాజ్ కుమార్ శనివారం ఉదయం మృతిచెందారు. ఆయనకు కూడా ఇది మొదటి సినిమా . మొదటి సినిమాకే ఐదు నంది అవార్డులు దక్కించుకున్నారు. వెట‌ర‌న్ ద‌ర్శ‌క‌ నిర్మాత రాజ్ కుమార్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలిసి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఆయనకు అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆ మధ్య ఆయన పెద్ద కుమారుడు కూడా అనారోగ్యంతో మృతి చెందడం.. ఆ తర్వాత భార్య చనిపోవడంతో రాజ్ కుమార్ ఒంటరివాడు అయ్యాడు.

స‌ద‌రు వెట‌ర‌న్ ద‌ర్శ‌కుడు పైసా సంపాదన లేక అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారని తెలిసింది. ప్ర‌స్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న‌ శనివారం ఉదయం మృతిచెందారు. ఆయన స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరు. భౌతికకాయాన్ని ఉయ్యూరు కు తీసుకు వెళ్ళేందుకు చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన మొద‌టి సినిమా పునాది రాళ్లు (1978). కానీ రిలీజైంది మాత్రం ప్రాణం ఖ‌రీదు(1979). ఆ త‌ర్వాత‌ పున్న‌మి నాగు - శుభ‌లేఖ‌- అభిలాష‌- ఖైదీ- గూండా .. ఇలా వ‌రుస‌గా అన్నీ క్లాసిక్ చిత్రాల్లో చిరంజీవి న‌టించారు. అయితే త‌న తొలి చిత్ర ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ పై అభిమానం క‌న‌బ‌రిచి చివ‌రి రోజుల్లో చిరు ఆదుకుని మంచి మ‌న‌సును ఆవిష్క‌రించారు.