Begin typing your search above and press return to search.
హీరోయిన్ కోసం దేశం దాటిన యంగ్ మేకర్
By: Tupaki Desk | 22 Aug 2022 5:30 PM GMTహీరోయిన్ల విషయంలో మేకర్స్ ఏమాత్రం తగ్గడం లేదు. క్రియేటివ్ పరంగా రాజీ పడే ప్రశక్తే లేదంటున్నారు. హీరోయిన్ల కోసం ఏకంగా దేశాలే దాటిపోతున్నారు. పాత్ర డిమాండ్ చేస్తుంది కాబట్టి తప్పడం లేదంటున్నారు. ఇటీవలే 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ ఏరికోరి మరి తీసుకొచ్చారు. ఆ పాత్ర కి ఆమె మాత్రమే న్యాయం చేయగలదని భావించి రాజమౌళి తొలిసారి దేశం దాటాడు.
సినిమాలో ఆ పాత్రని పెద్ద సక్సెస్ చేసాడు. రాజమౌళి ఏకంగా దేశం దాటడంతో అప్పట్లో కాస్త వ్యతిరేక పవనాలు వీచాయి. ఇండియాలో ఆమె అంత గొప్ప నటి లేదని...ఇంగ్లీష్ వాళ్లకు అవకాశాలు ఇస్తున్నారా? అని విమర్శలు ఎదుర్కున్నారు. ఇప్పటికీ కొంత మంది స్టార్ హీరోయిన్లు ఈ విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు.
తాజాగా రాజమౌళి మార్గంలోనే యంగ మేకర్ ...'జాతిరత్నాలు' ఫేం అనుదీప్ కూడా వెళ్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ యువ దర్శకుడు కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ తో ' ప్రిన్స్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా ఉక్రెయిన్ నటి మరియా ని తీసుకున్నాడు. ఆ పాత్రపై షూటింగ్ కూడా పూర్తిచేసాడు. ఈ విషయాన్ని మరియానే మీడియాకి రివీల్ చేసింది.
''ఈ ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. మంచి సృజనాత్మక బృందంతో కలిసి పనిచేయడం మరిచిపోలేని అనుభూతినిచ్చింది. సినిమా సెట్ లో అంతా స్నేహితుల్లా కలిసిపోయేవారు. ఇప్పుడు వీళ్లందర్నీ మిస్ అవుతున్నా. సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాని'' చెప్పుకొచ్చింది. మరి ఉక్రెయిన్ నుంచే నటిని తీసుకొచ్చారంటే? ఆ పాత్ర ప్రత్యేకత ఏంటి? అన్నది దర్శకుడు రివీల్ చేస్తే గానీ క్లారిటీ రాదు.
అయితే ఇలా ఉక్రెయిన్ భామని తీసుకురావడం...ఆమె పాత్రకి సంబంధించిన షూటింగ్ పూర్తిచేయడం అంతా వేగంగా..గోప్యంగా జరిగిపోయిందంటున్నారు.
ఆ కారణాలు ఎలా ఉన్నా? ఇలాంటి యువ మేకర్లు సైతం తమదేశం నటుల్ని కాదని పరదేశీ నటులకు అవకాశం కల్పించడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కనీసం స్థానిక హీరోయిన్లపై పనికొస్తుందా? లేదా? అని టెస్ట్ షూట్ కూడా నిర్వహించకుండా నేరుగా ఉక్రెయిన్ నటిని తీసుకోవడం పట్ల కొంత మంది హీరోయిన్లు అవేదన వ్యక్తం చేస్తున్నారు.