Begin typing your search above and press return to search.
ఔత్సాహిక ఫిలింమేకర్స్ ఉత్తమ అభ్యాస వేదిక
By: Tupaki Desk | 20 Nov 2022 1:30 AM GMTకృష్ణానగర్- ఫిలింనగర్ లో ఔత్సాహిక ఫిలింమేకర్స్ కి కొదవేమీ లేదు. ఇలాంటి వారందరినీ కమ్యూనలైజ్ చేసేందుకు సినిమా ఉత్సవాలు సహకరిస్తుంటాయి. దీనికోసం సారథి స్టూడియోస్ లాంటి చోట ఒక సంఘం కూడా నిరంతరం పని చేస్తోంది. హైదరాబాద్ లో పలుచోట్ల ఫిలింమేకింగ్ శిక్షణాలయాలు దీనికి కొంతవరకూ సహకరిస్తున్నాయి. మధు ఫిలింఇనిస్టిట్యూట్- అక్కినేని ఫిలింఇనిస్టిట్యూట్- రామానాయుడు ఫిలింఇనిస్టిట్యూట్- సత్యానంద్ ఫిలింఇనిస్టిట్యూట్- నటశిక్షణాలయం ఔత్సాహిక ఫిలింమేకర్స్ కోసం దశాబ్ధాల పాటు సేవలందిస్తున్నాయి.
అయితే పలు అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో నిరంతరం పాల్గొనడం ద్వారా ఫిలింమేకింగ్ పై అపారజ్ఞానం సాముపార్జించేందుకు ఆస్కారం ఉంటుంది. మంచి పరిచయాలు అన్నిరకాలా ఉపకరిస్తాయనడంలో సందేహం లేదు. నేటి సమాజంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని సినిమా ఏ స్థాయికి ఎదిగిందో కూడా తెలియాలంటే సినిమా పండగలకు హాజరు కావాల్సిందే. గోవా-ఇఫీ ఉత్సవాలకు ప్రతియేటా హైదరాబాద్ నుంచి భారీగా ఔత్సాహికుల అటెండెన్స్ ఉంటుంది. ఈ ఏడాది కూడా అందుకు సదవకాశం మన ముందుంది.
గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)కి ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇలాంటి ఉత్సవాల్లో టాప్ టెక్నీషియన్స్ తో చర్చలు ఔత్సాహిక ఫిలింమేకర్స్ కి ఎంతగానో ఉపయుక్తం. ఈ వేదికపై ఫిలింమేకింగ్ సహా చాలా విషయాలపై అవగాహనా కార్యక్రమాలు ఉంటాయి. ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.
మాన్యుస్క్రిప్ట్ నుండి స్క్రీన్‌ప్లేల వరకు నవంబర్ 22న ప్యానెల్ చర్చ సాగనుంది. ప్యానలిస్ట్ లలో రామిన్ బహ్రామి- ప్రీతి వ్యాస్- సునీత తాటి- మేఘనా గుల్జార్- విక్రమ్ సహాయ్ - తాన్య బామి లాంటి ప్రముఖ ఫిలిం విశ్లేషకులు మేకర్స్ ఉన్నారు. మోనికా ఓ మై డార్లింగ్ - ఖాకీ: ది బీహార్ చాప్టర్ ప్రదర్శనలు ఉత్తమంగా అలరించనున్నాయి. పుస్తకాల నుంచి అడాప్ట్ చేసిన సినిమాలపైనా చర్చ సాగుతుంది. స్క్రీన్ కోసం పుస్తకాన్ని స్వీకరించే కళపై అంతర్దృష్టి.. అభ్యాసాలు.. మార్గదర్శకాలు .. స్క్రీన్‌కు అనుకూలమైన మాన్యుస్క్రిప్ట్ ను ఎలా గుర్తించాలనే దానిపై చిట్కాలను ఈ వేదికపై నిపుణులు అందించనున్నారు. ఇతర ఔత్సాహిక చర్చలు.. స్నీక్ పీక్ లు.. ఇంటెలిజెంట్ ప్యానెల్ చర్చలు ఇవన్నీ నేటితరం ఫిలింమేకర్స్ కి ఉపయుక్తంగా ఉండనున్నాయి.
నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరిగే 53వ IFFIలో Netflix ప్రపంచ స్థాయి సిరీస్ లతో పాటు స్థానిక విడుదలలను కూడా ప్రదర్శిస్తుంది.ఖాకీ: ది బీహార్ చాప్టర్- ఖలా- పినోచియో- ఫౌడా సహా మరిన్ని సినిమాలను నెట్ ఫ్లిక్స్ ఈ ఉత్సవాల్లో ప్రదర్శించనుంది. ఇఫీలో నెట్‌ఫ్లిక్స్ తన ఫీచర్ లైనప్ ను ప్రకటించింది. స్ట్రీమింగ్ దిగ్గజం నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో ప్రత్యేకంగా ఫీచర్లను ప్రదర్శిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులతో యూనివర్సల్ స్టోరీ టెల్లింగ్ స్ఫూర్తిని పురస్కరించుకుని, నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ ప్రీమియర్ లు.. ఉత్తేజకరమైన స్నీక్ పీక్స్... తెలివైన ప్యానెల్ చర్చలు లాంటివి ప్రదర్శిస్తుంది.
గ్లోబల్ ప్రీమియర్ ఆఫ్ ఖాకీ: ది బీహార్ చాప్టర్ .. దీనిపై నవంబర్ 21న చర్చా కార్యక్రమం జరగనుంది. ప్యానెల్ లో శీతల్ భాటియా, ..భావ్ ధూలియా, ..కరణ్ టాకర్, ..అవినాష్ తివారీ,.. జతిన్ సర్నా,.. అభిమన్యు సింగ్- మోనికా షెర్గిల్ ఉన్నారు. నీరజ్ పాండే 'పల్పీ' క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ బీహార్ లో ఒక సూపర్ కాప్-సూపర్ విలన్ ల పుట్టుక నాటి ఘర్షణను తెరపై ఆవిష్కరించనుంది.
నవంబర్ 24న గురువారం నాడు క్వాలా గ్లోబల్ ప్రీమియర్ ప్రదర్శిస్తారు.
1930ల నేపథ్యంలో త్రిప్తి డిమ్రీ,.. స్వస్తిక ముఖర్జీ .. బాబిల్ ఖాన్‌ల అద్భుతమైన విజువల్స్,.. సంగీతం ప్రధాన ఆకర్షణ. శక్తివంతమైన ప్రదర్శనలతో తల్లీ-కూతుళ్ల సంబంధాన్ని అందంగా చూపే భావోద్వేగ సైకలాజికల్ డ్రామా ఖలా. ఈ చిత్రానికి అన్వితా దత్ దర్శకత్వం వహించారు. కర్నేష్ శర్మ,... క్లీన్స్ లేట్ ఫిల్మ్జ్ నిర్మించాయి.
పినోచియో ఇండియా ప్రీమియర్ ..ఆస్కార్-విజేత ప్రఖ్యాత ఫిలింమేకర్ గిల్లెర్మో డెల్ టోరో ఈ అద్భుతమైన స్టాప్-మోషన్ మ్యూజికల్ డ్రామా కథలో జీవం పోసిన చెక్క తోలుబొమ్మ క్లాసిక్ కథ ను తిరిగి ఆవిష్కరించారు. నవంబర్ 25న ఇది ప్రదర్శితం కానుంద.
S4 ఆసియా ప్రీమియర్... ఫౌడా E1 .. నవంబర్ 27న ప్యానెల్ లో చర్చ ఇవన్నీ సినిమా సాంకేతికతపై నాలెజ్ ని పెంచేవే. లియర్ రాజ్,.. అవి ఇస్సాచారోఫ్,.. రాజ్ కుమార్ రావ్ - మోనికా షెర్గిల్ తదితర సినీప్రముఖులు ''స్టోరీటెల్లింగ్ ఇన్ ది ఎరా ఆఫ్ గ్లోబల్ ఎంటర్ టైన్ మెంట్'' అనే అంశంపై చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన ఇజ్రాయెలీ సిరీస్ లలో ఒకటైన'ఫౌడా' సీజన్ 4 ఎపిసోడ్ 1 ఆసియా ప్రీమియర్ ఉంటుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో ప్రదర్శితం కానుంది.
''భారతీయ సినీపరిశ్రమ ప్రపంచంలోని అత్యంత డైనమిక్ ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమలలో ఒకటి. ఇలాంటి శక్తివంతమైన సృజనాత్మక సంఘంలో భాగం కావడానికి మేము సంతోషిస్తున్నాము'' అని నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్.. వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ తాజా సమావేశంలో అన్నారు.
నీరజ్ పాండే యొక్క ఉత్కంఠభరితమైన సిరీస్ 'ఖాకీ: ది బీహార్ చాప్టర్'.., ఎమోషనల్ డ్రామా ఖలా,.. ఆస్కార్-విజేత చిత్రనిర్మాత గిల్లెర్మో డెల్ టోరో మోస్ట్ అవైటెడ్ 'పినోచియో -సీజన్ 4' ఆసియా ప్రీమియర్ సహా అనేక రకాల నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ లోకల్ కథనాలను ప్రీమియర్ చేయనున్నామని ఆయన తెలిపారు. గ్లోబల్ హిట్ సిరీస్ ఫౌడా - ఈ సంవత్సరం IFFIలో తప్పక చూడవలసిన సిరీస్ అని అన్నారు.
నవంబర్ 20న స్వాతంత్య్ర సమరయోధులపై యానిమేటెడ్ కథనాలను ప్రదర్శిస్తారు. ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) ... నెట్‌ఫ్లిక్స్ భాగస్వామ్యంతో 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను స్పూర్తిదాయకంగా లఘు చిత్రాల ద్వారా జరుపుకోవడానికి 'ఆజాదీ కి అమృత్ కహానియన్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి కొనసాగింపుగా తదుపరి సెట్ చిత్రాలను IFFI 2022లో ప్రారంభించనున్నారు. మనోజ్ బాజ్‌పేయి కథనాన్ని అందించిన ఈ చిత్రాలు భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుల కథలను హైలైట్ చేస్తాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.