Begin typing your search above and press return to search.
ఫిలింనగర్ కల్చరల్ క్లబ్(FNCC) తిరిగి తెరుస్తున్నారట
By: Tupaki Desk | 28 Sep 2020 5:39 PM GMTకరోనా మహమ్మారీ భయాలతో సినీపరిశ్రమ సన్నివేశం తెలిసినదే. అయితే ఇప్పుడిప్పుడే స్టార్లు షూటింగులకు రెడీ అవుతుంటే త్వరలోనే థియేటర్లు తెరిపించేందుకు కేంద్రం నుంచి మార్గదర్శకాలు విడుదల కానున్నాయని తెలుస్తోంది. తాజాగా ఫిలింనగర్ కల్చరల్ క్లబ్(FNCC) రీ- ఓపెనింగ్ కి సన్నాహాలు చేస్తున్నారు.
1 అక్టోబర్ 2020 నుండి ఇందులో సకల సౌకర్యాల్ని అందుబాటులో ఉంచుతారట. అయితే ఇది మెంబర్స్ వరకూ మాత్రమే. బయటివారిని అనుమతించరు. అల్పాహారం.. ఎగ్జిక్యూటివ్ లంచ్.. టేక్-అవే ఫుడ్.. సండే బఫే.. స్పోర్ట్స్ విభాగం.. స్పా & గెస్ట్ రూమ్ ల సేవలతో ఎఫ్.ఎన్.సి.సి తెరిచి ఉంటుంది. w.e.f.a కార్డుల విభాగం.. బార్.. బాంకెట్ హాల్స్ & స్విమ్మింగ్ పూల్ సౌకర్యాలు తెరిచి ఉంటాయి. w.e.f. 1 అక్టోబర్ నుండి 2020 కోవిడ్ -19 కు వ్యతిరేకంగా సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ ఐడీ కార్డ్ సభ్యులను అనుమతించనున్నారు. ప్రవేశానికి ఫేస్ మాస్క్ .. టెంపరేచర్ థర్మల్ తనిఖీ ఏర్పాట్లు ఉంటాయి. అతిథులు ఖచ్చితంగా అనుమతించరని ఎఫ్.ఎన్.సి.సి ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఎఫ్.ఎన్.సి.సి ఫిలింనగర్ దైవసన్నిధానాన్ని ఆనుకుని ఉన్న భవంతుల సముదాయం. ఇందులో సినీఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీ హై ప్రొఫైల్స్ కి నిర్మాతలకు మెంబర్ షిప్ లు ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఎల్.ఇ.డి స్క్రీన్ పై నిరంతరం సినిమాల వీక్షణకు ఏర్పాటు ఉంది. కోవిడ్ ముందు నిరంతరం ప్రతిరోజూ సాయంత్రం కొత్త సినిమాల్ని ప్రదర్శించేవారు. కానీ కోవిడ్ వల్ల ఇటీవల ఎన్.సి.సి.సి మూగవోయింది. ఎట్టకేలకు తిరిగి తెరిచేందుకు సిద్ధమవుతుండడం విశేషం.
ఇక ఎఫ్.ఎన్.సి.సి ని ఆనుకుని ఫిలింఛాంబర్.. నిర్మాతల మండలి ఇప్పటికే తెరిచి ఉన్నాయి. అయితే మెంబర్స్ మాత్రం యాక్టివ్ గా ఇంతకుముందులా అక్కడే మీటింగులు పెట్టడం లేదని తెలిసింది. సినిమా ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆఫీస్ సహా కార్మికుల విభాగాలు తెరుచుకుంటున్నా కరోనా భయాలతో సౌండ్ మాత్రం తక్కువే ఉందని ఇన్ సైడ్ సమాచారం.