Begin typing your search above and press return to search.

ఓటీటీని ఊపేయ‌డానికి రెడీ అవుతోన్న దివాలీ చిత్రాలివే!

By:  Tupaki Desk   |   15 Oct 2022 7:37 AM GMT
ఓటీటీని ఊపేయ‌డానికి రెడీ అవుతోన్న దివాలీ చిత్రాలివే!
X
థియేట‌ర్ల‌ని మించిన సందడిప్పుడు ఓటీటీలో క‌నిపిస్తుంది. కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడా? అని ఓటీటీ ఆడియ‌న్స్ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. వారం వారం కొత్త కంటెంట్ తో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి ఓటీటీలు అలాగే పోటీ ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో దీపావ‌ళి సంద‌ర్భంగా ఓటీటీ అభిమానుల్ని మ‌రింత ఎగ్జైట్ మెంట్ కంటెంట్ తో అల‌రించ‌డానికి రెడీ అవుతోంది.

తెలుగు ఓటీటీ స్పేస్‌లో మ‌రిన్ని చిత్రాలు రాబోతున్నాయి. అక్టోబరు 20న సోనీ లివ్‌లో శర్వానంద్ హీరోగా న‌టించిన 'ఓకే ఒక జీవితం'తో ఈ జోష్ మొద‌ల‌వుతుంది. ఇప్ప‌టికే ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ థియేట‌ర్లో మంచి విజ‌యం సాధించింది. ఫ్యామిలీ డ్రామా ప్రేక్ష‌కుల్ని ఆద్యంతం అల‌రించింది. ఈసినిమా ఓటీటీ లో చ‌క్క‌ని వాచ్‌బుల్ మూవీగా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

అటుపై బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'బింబిసార' స్ర్టీమింగ్ కానుంది. నంద‌మూరి వార‌సుడు క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టించిన ఈ సినిమా ఇప్ప‌టికే ఓటీటీలో అందుబాటులోకి రావాలి. కానీ కొన్ని కారణాల వల్ల డిలే అయింది. ఇప్పుడా డిలేని దాటుకుని రెట్టించిన ఉత్సాహంతో జీ5 లో అక్టోబర్ 21 నుంచి అందుబాటులో ఉంటుంది.

ఈ టైమ్ ట్రావెల్ పీరిడిక్ యాక్షన్ చిత్రం ఓటీటీలో త‌ప్ప‌క చూడాల్సిన చిత్రంగా నిలుస్తుంది. కాన్సెప్ట్ బేస్ట్ చిత్రాల‌కు జాతీయ స్థాయిలో ఓటీటీలో ప్ర‌త్యేక‌మై గుర్తింపు ద‌క్కుతోంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రం హాలీవుడ్ లో ఫేమ‌స్ అయింది దానికి కార‌ణం ఓటీటీ స్ర్టీమింగ్ అన్న విష‌యం తెలిసిందే.

అలాగే యంగ్ హీరో నాగ‌శౌర్య న‌టించిన 'కృష్ణ బృందా విహారి' కూడా దీపావళి వారాంతంలో నిలిచింది. ఈ కామెడీ డ్రామా అక్టోబర్ 21న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతుంది. అలాగే బాలీవుడ్ ని ఓ పెన్సింగ్స్ షేక్ చేసి బ్రహ్మాస్త్ర మొద‌టి భాగం కూడా దీపాల పండుక్కే ఓటీటీలో సంద‌డి చేయ‌బోతుంది. ఈ చిత్రం అక్టోబర్ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ర్టీమింగ్ కి రెడీ అవుతోంది.

ఇంకా మ‌రిన్ని తెలుగు చిత్రాలు ఈ దీపావ‌ళికి ఓటీటీలో సంద‌డి చేయ‌నున్నాయి. చాలా చిత్రాలు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇంకా ఇత‌ర భాష‌ల చిత్రాలు స్ర్టీమింగ్ కి రెడీ అవుతున్నాయి. థియేట‌ర్లో యావ‌రేజ్ గా ఆడిన చిత్ర ఆల‌కు ఓటీటీలో మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఓటీటీ ఆడియ‌న్స్ కి టైంపాస్ చిత్రాలుగా నిలుస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.