Begin typing your search above and press return to search.
ఫన్ పిక్నిక్ కి ఫైనల్ డేట్ ఫిక్స్
By: Tupaki Desk | 14 Feb 2022 7:55 AM GMTవిక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరురుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం `ఎఫ్ 3`. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కాన్సెప్ట్ తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందిన `ఎఫ్ 2`కి సీక్వెల్ గా ఈ మూవీని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఈ మూవీ రీలీజ్ డేట్ మరో సారి మారింది. ఇప్పటికి రిలీజ్ డేట్ మారడం ఇది ఆరవసారి. వివరాల్లోకి వెళితే... జనవరి రిలీజ్ లు వాయదా పడటంతో క్రేజీ చిత్రాల రిలీజ్ లు వరుసగా మారుతూ వస్తున్నాయి.
జనవరిలో సంక్రాంతికి సందడి మామూలుగా వుండదని, ఈ సీజన్ లో భారీ చిత్రాల రిలీజ్‌లని పోటా పోటీగా మేకర్స్ ప్రకటించడంతో ఈ సారి పోటీ రసవత్తరంగా వుండబోతోందని సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ పోటా పోటీగా వారం వ్యవధిలో సంక్రాంతికి సందడి చేస్తాయంటూ ప్రచారం జరిగింది. డేట్ లు కూడా ఫైనల్ చేశారు. కానీ అనూహ్యంగా వాయిదా పడ్డాయి. ఆ తరువాత రెండు రెండు రిలీజ్ డేట్ లు ప్రకటించి చాలా వరకు ప్రేక్షకుల్ని కన్ఫ్యూజన్ లో పడేశాయి. ఒక్కో సినిమా దాదాపు అరడజన్ సార్లు రిలీజ్ డేట్ లు మారుస్తూ వస్తోంది.
ఫైనల్ గా మళ్లీ కొత్త రిలీజ్ డేట్ లని ప్రకటిస్తూ వస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కోసం రెండు రిలీజ్ డేట్ లు ప్రకటించిన మేకర్స్ తాజాగా హైనల్ రిలీజ్ డేట్ ఇదే అని మార్చి 25న రాబోతున్నామని స్పష్టం చేశారు. `రాధేశ్యామ్` టీమ్ కూడా అనేక తర్జన భర్జనల తరువాత ఫైనల్ గా మార్చి 11న వచ్చేస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చేశారు.
మార్చి 25 ఆర్ ఆర్ ఆర్ ఫైనల్, రాధేశ్యామ్ మార్చి 11, భీమ్లా నాయక్ ఫెబ్ 25 లేదా ఏప్రిల్ 1, ఆడవాళ్లు మీకు జోహార్లు ఫిబ్రవరి 25... గని ఫిబ్రవరి 25న అన్నారు. ... మే 27 మేజర్, ఆచార్య ఏప్రిల్ 29న, వలిమై ఫిబ్రవరి 24, బీస్ట్ ఏప్రిల్ 14, కేజీఎఫ్ ఏప్రిల్ 14, రామారావు ఆన్ డ్యూటీ మార్చి 25 లేదా ఏప్రిల్ 15 అంటూ రిలీజ్ డేట్ లు ప్రకటించేశారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 28న వస్తున్నామంటూ ప్రకటించిన `ఎఫ్ 3`ని తాజాగా మే 27 న రిలీజ్ చేస్తున్నామని, ఫన్ పిక్నిక్ కి ఫైనల్ డేట్ ఫిక్స్ చేశాం` అని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించేశారు.
ఉన్నట్టుండి ఎఫ్ 3 వెనక్కి వెళ్లడానికి కారణం `ఆచార్య` అని చెబుతున్నారు. ఏప్రిల్ 29న ఆచర్య రిలీజ్ కి రెడీ అయిపోతోంది. ఆ కారణంగానే `ఎఫ్ 3`ని మే 27కు పోస్ట్ పోన్ చేశారట. మిగతా చిత్రాలన్నీ రిలీజ్ డేట్ లు ప్రకటిస్తున్నా `భీమ్లా నాయక్` రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా డౌట్ లోనే వుండటం ఇండస్ట్రీ వర్గాలని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.