Begin typing your search above and press return to search.
హిందీ బాహుబలి రికార్డుకు ఎసరెట్టిన అవెంజర్స్
By: Tupaki Desk | 3 May 2019 11:04 AM GMTఇండియన్ సినిమాల బాక్స్ ఆఫీసుల రికార్డుల గురించి మాట్లాడాలంటే 'బాహుబలి' ప్రస్తావన తీసుకురావడం తప్పనిసరి. 'బాహుబలి: ది బిగినింగ్' రికార్డులు చెరిగిపోయాయి కానీ 'బాహుబలి: ది కంక్లూజన్' రికార్డులు మాత్రం ఇప్పటికే పదిలంగా ఉన్నాయి. అయితే ఒక విషయంలో మాత్రం రీసెంట్ గా రిలీజ్ అయిన హాలీవుడ్ ఫిలిం 'అవెంజర్స్: ఎండ్ గేమ్' 'బాహుబలి' రికార్డుకు ఎసరు పెట్టిందని చర్చ సాగుతోంది.
మొదటివారం వసూళ్ళను తీసుకుంటే 'బాహుబలి2' హిందీ వెర్షన్ నెట్ కలెక్షన్స్ ను 'అవెంజర్స్: ఎండ్ గేమ్' క్రాస్ చేసింది. 'బాహుబలి 2' కలెక్షన్స్ 247 cr కాగా 'అవెంజర్స్: ఎండ్ గేమ్' కలెక్షన్స్ 260. cr వచ్చాయి. హిందీ సినిమాల వరకూ చూస్తే ఇప్పటివరకూ భారీ కలెక్షన్స్ సాధించిన చిత్రం 'బాహుబలి 2' హిందీ వెర్షన్. కానీ 'అవెంజర్స్'.. 'బాహుబలి 2' పోలిక సరిగా లేదని కొందరు నెటిజనులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 'బాహుబలి' హిందీ వెర్షన్ వసూళ్ళను 'అవెంజర్స్' హిందీ వెర్షన్ తో పోల్చాలి. అలా కాకుండా బాహుబలి మాత్రం హిందీ వెర్షన్ తీసుకొని అవెంజర్స్ మాత్రం అన్నీ వెర్షన్స్ తీసుకుంటే ఎలా అన్నది వారి లాజిక్. 'బాహుబలి 2' కూడా అన్ని వెర్షన్స్ తీసుకుంటే 'అవెంజర్స్' వసూళ్ళు రెండో స్థానంలోనే ఉంటాయి.
దీన్ని మనం 'అవెంజర్స్' వెర్సస్ హిందీ సినిమాల మొదటి వారం ఇండియా వసూళ్లు అనే కోణంలో చూడాలి. అలా చూస్తే మొదటి ఆరు స్థానాల్లో ఉన్న సినిమాలు ఇలా ఉన్నాయి.
అవెంజర్స్-ఎండ్ గేమ్: 260 cr
బాహుబలి 2(హిందీ): 247 cr
సుల్తాన్: 229.16 cr (9 రోజులు)
టైగర్ జిందా హై: 206 cr
సంజు: 202 cr
దంగల్:197 cr