Begin typing your search above and press return to search.
ఫైనల్ గా క్రియేటర్ రంగంలోకి దిగుతున్నాడు!
By: Tupaki Desk | 2 July 2022 8:33 AM GMTఫ్యామిలీ ఎంటర్ టైనర్ లకు తనదైన మార్కు భావోద్వేగాల్ని జోడించి తెరకెక్కించడంలో ఒకప్పుడు క్రియేటర్ ఆయన. సున్నితమైన భావోద్వేగాల్ని అందంగా ఆవిష్కరిస్తూ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ఆయనే కృష్ణవంశీ. 'మహాత్మ' తరువాత ఆయన హిట్టు అనే మాట విని దాదాపు 12 ఏళ్లు పూర్తి కావస్తోంది. 'మహాత్మ' తరువాత నాలుగు సినిమాలు చేసినా ఏ ఒక్కటీ ఆకట్టుకోలేకపోయాయి. భారీ డిజాస్టర్ లుగా మిగిలాయి.
దీంతో తదుపరి చిత్రాలనికి దాదాపు నాలుగేళ్లు విరామం తీసుకున్నారు. ప్రస్తుతం కృష్ణవంశీ రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ 'రంగ మార్తాండ'. మారఠీలో విలక్షణ నటుడు నానా పటేకర్ నటించిన 'నట సామ్రాట్' కిది రీమేక్.
అక్కడ సంచలనాలు సృష్టించడమే కాకుండా విమర్శలకు ప్రశంసల్ని సైతం సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని కృష్ణవంశీ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. గత కొంత కాలంగా బడ్జెట్ కారణంగా చిత్ర నిర్మాణం ఆలస్యం అవుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మానానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓ పాపులర్ ఓటీటీ ఆఫర్ ఇవ్వడంతో ఈ మూవీ నిర్మాణం స్పీడందుకుందని, వారి సహకారం వల్లే పూర్తయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ మూవీని డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదల చేసే అవకాశం వుందని ప్రచారం జరుగుతోంది.
అయితే దర్శకుడు కృష్ణవంశీ మాత్రం ఈ మూవీని ఎట్టపరిస్థితుల్లోనూ థియేట్రికల్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇదిలా వుంటే ఈ మూవీ కోసం కృష్ణవంశీ స్టార్ హీరో మెగాస్టార్ ని రంగంలోకి దింపారు. ఆయన చేత వాయిస్ ఓవర్ చెప్పించారు. అయితే చిరు ఈ మూవీ కోసం రెగ్యులర్ పంథాలో వాయిస్ ఓవర్ చెప్పడం లేదు. కథలోని ఎమోషన్ ని రన్ చేసే విధంగా చిరు వాయిస్ వుంటుందని తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఇంత వరకు ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని గానీ, టైటిల్ పోస్టర్ ని కానీ కృష్ణ వంశీ ఇంత వరకు విడుదల చేయలేదు. ఇప్పటి వరకు రక రకాల ఫ్యాన్ మేడ్ టైటిల్ డిజైన్స్ వెలుగులోకి వచ్చాయి. అయితే మరో రెండు రోజుల్లో టైటిల్ డిజైన్ ని విడుదల చేయబోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా కృష్ణవంశీ వెల్లడించారు. లోగో డిజైన్ వర్క్ మొదలైందని, మరో రెండు రోజుల్లో విడుదల చేస్తామని, మీకు బాగా నచ్చుతుందని గట్టిగా నమ్ముతున్నానని వెల్లడించారు.