Begin typing your search above and press return to search.
ఫైనల్ గా కొరటాల - ఎన్టీఆర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా?
By: Tupaki Desk | 28 Oct 2022 7:30 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'RRR'తో వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవడమే కాకుండా ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరిపోయాడు. రికార్డు స్థాయిలో వరల్డ్ వైడ్ గా వసూళ్లని అందించిన ఈ మూవీతో ఎన్టీఆర్ భారీ స్థాయిలో పాపులారిటీని కూడా దక్కించుకున్నాడు. 'RRR' అందించిన హ్యూజ్ సక్సెస్ జోష్ లో వున్న ఎన్టీఆర్ అదే జోష్ తో తన 30వ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలనుకున్నాడు.
తనకు 'జనతా గ్యారేజ్'తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో తన 30వ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టాలనుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ ని అథికారికంగా ప్రకటించారు కూడా. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున ఈ మూవీని అథికారికంగా ప్రకటిస్తూ డైలాగ్ మోషన్ టీజర్ ని విడుదల చేశారు. దీంతో ఈ మూవీ ఇక పట్టాలెక్కబోతోందని అంతా ఊహించారు. కానీ నెలలు గడుస్తున్నా ఈ ప్రాజెక్ట్ మాత్రం ముందుకు కదలడం లేదు.
ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడటం మొదలు పెట్టారు. మేకర్స్ ని సోషల్ మీడియా వేదికగా నిలదీయడం మొదలు పెట్టారు. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్ రావడం లేదంటూ అసహనం వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. ఫ్యాన్స్ అసహనాన్ని గమనించిన ఎన్టీఆర్ ఎట్టిపరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ ని డిసెంబర్ నుంచి పట్టాలెక్కించాలని దర్శకుడు కొరటాల శివకు ఆల్టిమేటమ్ జారీ చేశాడంటూ వార్తలు షికారు చేయడం మొదలైంది.
తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు కొరటాల శివ, ఎన్టీఆర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఓ ఆసక్తికరమైన అప్ డేట్ బయటికి వచ్చేసింది. 'RRR' ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్, రాజమౌళితో కలిసి జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ తిరిగి ఇండియా వచ్చేశాడు.
గత కొంత కాలంగా ఆలస్యం అవుతున్న కొరటాల ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టడం మొదలు పెట్టారు. త్వరలోనే కొరటాల ఫైనల్ డ్రాఫ్ట్ ని వినిపించబోతున్నారట. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే నవంబర్ లో మంచి ముహూర్తం చూపుకుని ప్రారంభోత్సవాన్ని చేయబోతున్నారట.
ఇక రెగ్యులర్ షూటింగ్ ని మాత్రం డిసెంబర్ నుంచి మొదలు నెట్టి నాన్ స్టాప్ గా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా లాంచ్ చేయబోయే తేదీని ఎన్టీఆర్ ఫైనల్ చేయనున్నాడని చెబుతున్నారు. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని నిర్మించబోతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.