Begin typing your search above and press return to search.
పెళ్లి వార్తలపై మొత్తానికి రియాక్ట్ అయింది
By: Tupaki Desk | 2 Feb 2022 5:55 AM GMTఅందాల రాక్షసి` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది డెహ్రాడూన్ బ్యూటీ లావణ్య త్రిపాఠి. తొలి చిత్రంతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న లావణ్య ఆ తరువాత ఆ స్థాయిలో అవకాశాలతో పాటు సక్సెస్లని సొంతం చేసుకోలేకపోతోంది. `అర్జున్ సురవరం` చిత్రంతో మూడేళ్ల క్రితం సూపర్ హిట్ ని సొంతం చేసుకున్న లావణ్య ప్రస్తుతం `హ్యాపీ బర్త్ డే` చిత్రంలో నటిస్తోంది. గత కొన్ని రోజులుగా లావణ్యపై ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది.
హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరోని వివాహం చేసుకోబోతోందని, త్వరలోనే ఈ పెళ్లికి సంబంధించిన వార్తని అఫీషియల్ గా ప్రకటించబోతోందని నెట్టింట ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై లావణ్య స్పందించలేదు. దీంతో లావణ్య పెళ్లిపై మరిన్ని వార్తలు వైరల్ కావడం మొదలైంది. దీంతో ఎట్టకేలకు తనపై వస్తున్న పెళ్లి వార్తలపై లావణ్య త్రిపాఠి స్పందించింది. తాజాగా అభిమానులతో ఇన్ స్టా గ్రామ్ లైవ్ లో మాట్లాడిన లావణ్య తనపై వస్తున్న పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
అయితే ముందు పెళ్లి వార్తలపై స్పందించడానికి ఆసక్తిని చూపించకపోవడంతో ఫ్యాన్స్ అదే ప్రశ్నని పదే పదే అడగడం మొదలు పెట్టారు. అయినా తను చేస్తున్న తాజా చిత్రం `హ్యాపీ బర్త్డే`కు సంబంధించిన విశేషాలు చెప్పడానికే ప్రాధాన్యతనిచ్చింది. అయినా ఫ్యాన్స్ వినక మళ్లీ పెళ్లి గురించే ప్రస్తావించడంతో లావణ్య స్పందించక తప్పలేదు. ` కొంత మంది ఎలా చేస్తారో నా పెళ్లి గురించి నాకు కూడా తెలియదు`అని తెలిపింది. ఈ సామాధానాన్ని బట్టి లావణ్య తన పెళ్లి వార్తను తను కూడా ఓ వార్తలాగే చూస్తోందని స్పష్టమైంది.
అయితే ఇక్కడో అనుమానం..ఎవరైనా పెళ్లి గురించి అడిగినా.. డేటింగ్ లో వున్నారని ప్రశ్నించినా టక్కున చెప్పే మాటలు `నేను సింగిల్` అని, లేదా నేను ఎవరితో డేటింగ్ లో లేనని, నాకు ప్రేమ అంటే పడదని, ప్రేమ వివాహాలకు తాను దూరమని చెబుతారు . కానీ లావణ్య మాత్రం అలా కాకుండా భిన్నంగా స్పందించడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా మీ పెళ్లి వార్తలని ఖండిస్తున్నారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కూడా నేరుగా లావణ్య సమాధానం చెప్పలేదు.
మౌనంగానే వుండిపోయింది. లావణ్య చెప్పిన వన్ వర్డ్ సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలకు ఆజ్యం పోసేవిగా వున్నాయో కానీ వాటిని ఖండిస్తున్నట్టుగా కనిపించడం లేదని పలువురు ఇండస్ట్రీ వర్గాలు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల `చావు కబురు చల్లగా` చిత్రంతో ఫ్లాప్ ని ఎదుర్కొన్న లావణ్య త్రిపాఠి ప్రస్తుతం `హ్యాపీ బర్త్ డే` చిత్రంలో నటిస్తోంది. దీనిపైనే ఆమె ఆశలన్నీ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.