Begin typing your search above and press return to search.
ఫైనల్ గా SSMB28 అప్ డేట్ వచ్చేసింది!
By: Tupaki Desk | 9 July 2022 6:29 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ల విరామం తరువాత 'సర్కారు వారి పాట' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో ఫ్యాన్స్ చాలా వరకు డిజప్పాయింగ్ అయ్యారు. #SSMB28 తో అయినా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవాలని ఆశగా ఎదురుచూడటం మొదలు పెట్టారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు తన 28వ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ నిర్మించబోతున్నారు.
దాదాపు 12 ఏళ్ల విరామం తరువాత త్రివిక్రమ్ - మహేష్ కలయికలో రానున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచనాల మధ్య తెరపైకి రాబోతున్న ఈ మూవీలో మహేష్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డేని ఫైనల్ చేశారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా లాంఛనంగా జరిగాయి. కానీ ఇంత వరకు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించిన అప్ డేట్ మాత్రం మేకర్స్ నుంచి రాలేదు.
'అతడు, ఖలేజా వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ కాంబోగా పేరు తెచ్చుకున్న మహేష్ - త్రివిక్రమ్ ల సినిమా ఎప్పెడప్పుడు పట్టాలెక్కుతుందా? అని ఫ్యాన్స్ తో పాటు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'సర్కారు వారి పాట' రిలీజ్ తరువాత మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. ఇటలీలో వున్న మహేష్ కి త్రివిక్రమ్ ఫైనల్ స్క్రిప్ట్ నరేట్ చేశాడని, టోటల్ స్క్రిప్ట్ సంతృప్తిగా అనిపించడంతో మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని వార్తలు వినిపించాయి.
ఇటలీ నుంచి తిరిగి వచ్చిన త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని ప్రారంభించారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి అప్ డేట్ లేదు. ఫ్యాన్స్ ఈ మూవీ అప్ డేట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్న వేళ ఎట్టకేలకు మేకర్స్ శనివారం అఫీషియన్ గా రెగ్యులర్ షూటింగ్ తో పాటు మూవీ రిలీజ్ ఎప్పుడో అప్ డేట్ ఇచ్చేశారు. మాసీవ్ ఎపిక్ బ్లాస్ట్‌గా రానున్న ఈమూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానుందని, సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కు భారీ స్థాయిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసురాబోతున్నారు. పాన్ ఇండియా మూవీస్ హవా ఎక్కువైన నేపథ్యంలో ఈ మూవీని కూడా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ నేపథ్యంలో రూపొందించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
సరికొత్త నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీలో మహేష్ నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించనున్నారట. కనీ విని ఎరుగని తారాగణంతో పాటు అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి వర్క్ చేయనున్నారట. తమన్ సంగీతం, పీఎస్ వినోద్ ఛాయాగ్రహణం, నవీన్ నూలి ఎడిటింగ్, ఏ.ఎస్ . ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు.

For Video>> http://https://youtube.com/shorts/Weej4DEWLUg?feature=share