Begin typing your search above and press return to search.
సుమంత్ సినిమా.. యధావిధిగా రిలీజ్!
By: Tupaki Desk | 4 Nov 2016 4:50 AM GMTసుమంత్ నుంచి లేక లేక ఓ సినిమా.. అందులోనూ పాజిటివ్ బజ్ మధ్య రిలీజవుతుంటే అనుకోని అవాంతరం ఎదురైంది. సుమంత్ చివరి సినిమా ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’కు సంబంధించి ఫినాన్షియల్ ఇస్యూస్ తలెత్తడంతో ఈ సినిమా విడుదలపై స్టే ఆర్డర్ ఇచ్చింది ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టు. తాళ్ల పల్లి ప్రసాద్ అనే వ్యక్తి ‘నరుడా డోనరుడా’ విడుదలను ఆపాలంటూ దీని నిర్మాతల్లో ఒకరైన పూదోట సుధీర్ కుమార్ కు వ్యతిరేకంగా పిటిషన్ వేశాడు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో సుమంత్ సినిమా అనుకున్న ప్రకారం శుక్రవారమే రిలీజవుతుందా లేదా అన్న సందిగ్ధత నెలకొంది.
ఐతే తాజా సమాచారం ప్రకారం పిటిషనర్ తో గురువారం రాత్రి జరిగిన మంతనాలు ఫలించాయట. అసలు అతను సుమంత్ కు.. సుధీర్ కుమార్ కు అసలేమాత్రం సమాచారం ఇవ్వకుండానే నేరుగా కోర్టుకెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నట్లు తెలిసింది. ఐతే రాత్రి చర్చల అనంతరం ఇష్యూ సెటిలైంది. పిటిషన్ వెనక్కి తీసుకుని సినిమా విడుదలకు సహకరించడానికి ప్రసాద్ ఒప్పుకున్నాడు. కోర్టు పని వేళలు మొదలవ్వగానే ఈ ఫార్మాలిటీస్ పూర్తవుతాయి. దీంతో మార్నింగ్ షోలు పడే సమయానికి వ్యవహారం సద్దుమణిగిపోతుందని.. యధావిధిగా సినిమా రిలీజవుతుందని సమాచారం. వచ్చే శుక్రవారం నాగచైతన్య సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’ విడులవుతున్న నేపథ్యంలో సుమంత్ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వీకెండ్లోనే రిలీజ్ చేసి తీరాల్సిందే. ఈ వీకెండ్ కాదంటే ఆ తర్వాత గందరగోళం అయిపోతుంది. అందుకే వివాదాన్ని వేగంగా సెటిల్ చేసేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/