Begin typing your search above and press return to search.
సిల్క్ స్మిత ఆత్మహత్యకు కారణమేంటో తెలుసా?
By: Tupaki Desk | 23 Sept 2020 4:40 PM ISTసిల్క్ స్మిత .. ఈ పేరు పరిచయం అవసరం లేదు. తళుకుబెళుకుల సినీవినీలాకాశంలో రాలిన తార. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని భారతీయ సినిమాను దశాబ్దాల పాటు శాసించిన బోల్డ్ & గ్లామరస్ బ్యూటీగా ప్రసిద్ది చెందింది. సిల్క్ స్మిత ఇండస్ట్రీ ఇచ్చిన పేరు అయితే.. విజయలక్ష్మి వడ్లపతి అనేది అసలు పేరు. విజయవాడ నుంచి మద్రాసుకు కళారంగంపై మక్కువతో వెళ్లాక అక్కడ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని నటిగా అనుకున్న స్థాయికి ఎదిగింది స్మిత.
సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుని 20 ఏళ్ళకు పైగా అయింది. కాని ఇప్పటి వరకు తాను ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది? అన్నది ఎవరికీ తెలీని మిస్టరీగానే ఉండిపోయింది. 23 సెప్టెంబర్ 1996 లో స్మిత చెన్నై లోని తన అపార్ట్ మెంట్ లో చనిపోయినట్లు గుర్తించారు. అందుకు కచ్చితమైన కారణం ఎవరికీ తెలియకపోయినా ఆర్థిక పరమైన సమస్యలు ఒక కారణమని విశ్లేషించారు.
ఇండస్ట్రీలో ప్రేమ వైఫల్యం.. భ్రమల్లో జీవించడంతో చివరికి తీవ్రమైన నిరాశకు గురైన స్మిత ఊపిరిసలపనివ్వని సమస్యలతో పోరాటం సాగించిందని చెబుతారు. సిల్క్ స్మిత జీవితం స్ఫూర్తితో `ది డర్టీ పిక్చర్` (2011) బాలీవుడ్ లో తెరకెక్కి సౌత్ లోనూ విడుదలైంది. విద్యాబాలన్ నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.