Begin typing your search above and press return to search.

గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే ఫైనాన్షియల్ సపోర్ట్..!

By:  Tupaki Desk   |   19 Jan 2023 10:30 AM GMT
గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే ఫైనాన్షియల్ సపోర్ట్..!
X
మనీ లాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్ అరెస్ట్ అవగా అతనితో పరిచయం ఉన్న వారికి కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ కు సుఖేష్ చంద్రశేఖర్ తో సన్నిహితంగా ఉండటం తో ఆమె మీద కేసు ఫైల్ అయ్యింది. అయితే సుఖేష్ పరిచయస్తులలో బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి కూడా ఉంది. నోరా ఫతేహిని ఇంప్రెస్ చేసేందుకు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాడట సుఖేష్ చంద్రశేఖర్. విలువైన బహుమతులు, బి.ఎం.డబల్యు కారుని కూడా గిఫ్ట్ గా ఇచ్చాడట.

నోరా ఫతేహికి ఇవన్ని కొనిచ్చి ఆమెను తన గర్ల్ ఫ్రెండ్ గా ఉండమని చెప్పాడట సుఖేష్. అంతేకాదు ఆమెకు జీవితాంతం కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తానని తను జస్ట్ అతనికి గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే చాలని అన్నాడట. ఈ విషయాలన్ని తన ఫ్యామిలీ మెంబర్స్ ని విసిగించాయని అంటుంది నోరా ఫతేహి. తన జీవితానికి, ఫ్యామిలీకి, కెరీర్ కి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ గా ఉంటానని కాకపోతే అందుకు బదులుగా అతనికి గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలని కోరాడట.

సుఖేష్ తో సన్నిహితంగా ఉన్న వారు ఒక్కొక్కరు తన గురించి ఇలాంటి వివరాలు ఇస్తున్నారు. జాక్వెలిన్ కూడా సుఖేష్ కి తను ఒక్కదాన్నే గర్ల్ ఫ్రెండ్ కాదని అతనికి చాలామందితో లింక్ ఉందని తన ఫిర్యాదులో రాసుకొచ్చింది. అతన్ని నమ్మి తాను పూర్తిగా మోసపోయినట్టు చెప్పింది. దాదాపు నోరా ఫతేహి వర్షన్ కూడా అలానే ఉంది.

అతను డబ్బులు ఇస్తున్నాడు కదా అని అనుకున్నారు కానీ సుఖేష్ ఇలా మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కుంటాడని ఊహించి ఉండరు. ఇప్పుడు ఎవరికి వారు సుఖేష్ చేసిన వాటికి తమకు ఎలాంటి సంబంధం లేదు. తమని గర్ల్ ఫ్రెండ్ గా ఉండమని మాత్రమే అతను తమకు విలువైన బహుమతులు ఇచ్చాడని అంటున్నారు. మొత్తానికి సుఖేష్ కేసులో రోజుకొక ట్విస్ట్ జరుగుతుందని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.