Begin typing your search above and press return to search.
సల్మాన్ మాఫియా లింకులపై ఆరా! తనని ఎవరూ బెదిరించలేదా?
By: Tupaki Desk | 8 Jun 2022 4:36 AM GMTగత కొన్ని రోజులుగా బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ పోలీస్ రక్షణ వలయంలో లైఫ్ ని లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పంజాబీ సింగర్ మూస్ వాలాను చంపినట్టే సల్మాన్ ను కూడా చంపేస్తామని కృష్ణ జింక కేసుతో లింకులు ఉన్న మాఫియా డాన్ లారెన్స్ బిష్ణోయ్ వార్నింగ్ ఇచ్చినట్టు కథనాలు కూడా సంచలనం అయ్యాయి.
అంతేకాదు.. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ ని చంపేస్తామని ఒక లేఖలో ప్రచురించడం కలకలం రేపింది. అనంతర కాలంలో సల్మాన్ కి అతడి కుటుంబానికి పోలీస్ సెక్యూరిటీ అమాంతం పెరిగింది. నిన్నటి రోజున సల్మాన్ హైదరాబాద్ షూటింగ్ కి వచ్చినప్పుడు పోలీసులతో రక్షణ వలయం ఏర్పాటు చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
తాజాగా ఈ కేసు విషయమై ముంబై పోలీసుల విచారణలో సల్మాన్ పలు ఆసక్తికర సంగతుల్ని వెల్లడించారు. తనకు ఎలాంటి బెదిరింపు ఫోన్ కాల్ లు కానీ మెసేజ్ లు కానీ రాలేదని ఎలాంటి గొడవలు లేవని ముంబై పోలీసులకు తెలిపారని తెలుస్తోంది. అతని వాంగ్మూలం సోమవారం సాయంత్రం రికార్డ్ చేసారు. అతనికి అతని తండ్రిగారైన రచయిత సలీం ఖాన్ కు బెదిరింపు లేఖ వచ్చింది. ముంబై బాంద్రాలోని సల్మాన్ ఫ్యామిలీ నివాసానికి సమీపంలో ఉదయం నడక తర్వాత సలీం ఖాన్ తాను కూర్చున్న బెంచ్ పై ఈ లేఖ దొరికింది.
మే 29న పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యకేసులో నిందితుడైన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈ బెదిరింపు లేఖతో తమకు ఎలాంటి సంబంధం లేదని అంతకుముందే ఓ కథనంలో నివేదించారని ప్రచారమైంది. హిందీలో వన్-లైన్ బెదిరింపు పేపర్ చిట్ పై రాసి ఉంది. సలీం ఖాన్- సల్మాన్ ఖాన్ బహుత్ జల్ద్ ఆప్కా మూస్ వాలా హోగా... (సలీం ఖాన్,.. సల్మాన్ ఖాన్ అతి త్వరలో మీరు మూస్ వాలా విధిని కలుస్తారు) అని ఆ లేఖలో ఉంది. లారెన్స్ బిష్ణోయ్ పేరును తెలిపే మొదటి అక్షరాలు LB ఆ లేఖలో కనిపించాయి. దీంతో ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు అలెర్టయ్యారు.
లారెన్స్ బిష్ణోయ్ 2018లో సల్మాన్ ఖాన్ ను జోధ్‌పూర్ లో విచారణ కోసం తీసుకువచ్చిన కోర్టు వెలుపల జర్నలిస్టులతో ఇంటరాక్షన్ లో బెదిరించారు. ప్రస్తుతం అతడు దిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు. ఇప్పుడు బెదిరింపు లేఖ విషయంలో సల్మాన్ ఖాన్ తో మాట్లాడే ముందు పోలీసులు సలీం ఖాన్ స్టేట్ మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. ముంబై బాంద్రాలోని తమ ఫ్యామిలీ నివాసం చుట్టూ కూడా భద్రతను పెంచారు. బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 506-II (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదైంది. బెదిరింపు లేఖను పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారని పోలీసు కమిషనర్ సంజయ్ పాండే తెలిపారు.
పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేసిన తర్వాత సినిమా షూటింగ్ కోసం సల్మాన్ బయల్దేరారని సమాచారం. ప్రస్తుతం ఈ కేసు విచారణలో గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్ .. గోల్డీ బ్రార్ లకు ఏమైనా సంబంధం ఉందా? అని సల్మాన్ ని పోలీసులు ప్రశ్నించారు. ``నాకు అందరిలాగే లారెన్స్ బిష్ణోయ్ తెలుసు. గోల్డీ బ్రార్ గురించి నాకు తెలియదు`` అని సల్మాన్ పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. సల్మాన్ కు హాని కలిగించే అనుమానితుల గురించి కూడా విచారించారు. దీనికి ఆయన మాట్లాడుతూ.. ఎవరినీ అనుమానించాల్సిన అవసరం లేదు.. అని అన్నారు.
పంజాబీ రాపర్ సిద్ధూ మూస్ వాలా మాదిరిగానే అతనిని అతని తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తానని బెదిరించే నోట్ తో పాటు.. సల్మాన్ కు ఇంకేమైనా బెదిరింపు కాల్ లు.. నోట్స్ లేదా సందేశాలు వచ్చాయా అని అడిగారు. దీనికి అతడు ``నేరుగా సమాధానం ఇవ్వలేదు`` అనేది ఒక గుసగుస. ఇటీవల తనకు కానీ లేదా తన కుటుంబంలోని ఇతరులు ఎవరికీ ప్రాణాపాయ బెదిరింపులు ఎదురు కాలేదని పేర్కొన్నాడు.
అయితే హత్య బెదిరింపు చిలిపితనం కాదు.. అందుకే పోలీసులు లైట్ తీస్కోవడం లేదని సమాచారం. ఈ కేసులో లారెన్స్ ప్రమేయం విషయానికి వస్తే,.. గ్యాంగ్‌స్టర్ సైతం ఈ ప్రచారాన్ని ఖండించినట్లు తెలిసింది. సల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను ప్రశ్నించనున్నారని సమాచారం.
సల్మాన్ ఖాన్ హత్య బెదిరింపు లేఖ కేసులో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రమేయం లేదని కూడా అనంతరం ఢిల్లీ పోలీసులు తెలిపారు. తాజా గుసగుసల ప్రకారం.. ముంబై పోలీసు బృందం బిష్ణోయ్ ని ప్రశ్నించడానికి న్యూఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ప్రత్యేకించి 1998లో రాజస్థాన్‌లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో నటుడు సల్మాన్ ను చంపుతానని గతంలో వార్నింగ్ ఇచ్చినందున అతడిని కచ్ఛితంగా ప్రశ్నిస్తారు.