Begin typing your search above and press return to search.

పోర్న్ పాపపై పోలీస్ కేసు

By:  Tupaki Desk   |   11 Feb 2016 5:58 AM GMT
పోర్న్ పాపపై పోలీస్ కేసు
X
పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ గా మారిన సన్నీ లియోన్ కు ఇండియాలో చాలానే ఫాలోయింగ్ ఉంది. అదే సయమంలో అంతకు మించి సన్నీని వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. పూర్తిగా అడల్ట్ అగ్లీ సినిమాలకే పరిమితమైన ఈ సుందరాంగి.. ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడింది.

రీసెంట్ విడుదలన మస్తీజాదే సినిమాలో ఓ సీన్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందంటూ.. సన్నీలియోన్ తో పాటు సహ నటులైన వీర్ దాస్ - తుషార్ కపూర్ - నిర్మాత - దర్శకుడు. రైటర్ సహా.. మొత్తం యూనిట్ పై పోలీస్ కంప్లెయింట్ అందింది. కండోమ్ ఉపయోగించడం గురించి.. కాళీ మాత గుడిలో చాలా వల్గర్ గా ఎక్స్ ప్లెయిన్ చేసే సీన్ పైన ఫిర్యాదు అందింది. ఆ కండోమ్ కంపెనీని కూడా కేసు నమోదైంది. ఢిల్లీ లోని ఆదర్శ్ నగర్ లో ఎఫ్ ఐఆర్ రిజస్టర్ చేశారు.

సెక్షన్ 153ఏ- రెండు గ్రూపుల మధ్య విబేధాలు తలెత్తేలా చేయడం, సెక్షన్ 295ఏ- హిందువుల నమ్మకాలను, కాళీ మాతను అవమానించడం, సెక్షన్ 298- హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీయడం సెక్షన్లతో పాటు సెక్షన్ 120బీ, సెక్షన్ 34 ల ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ క్రేజ్, సినిమాలతో నెట్టుకొచ్చిన సన్నీకి.. ఈ కేసు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.