Begin typing your search above and press return to search.
రాఖీపై అసభ్య కేసు.. ఇంకా వదల్లేదు!
By: Tupaki Desk | 5 Nov 2016 4:58 AM GMTఅమెరికా చికాగోలో జరిగిన ప్రీ ఇండిపెండెన్స్ పార్టీలో రాఖీ సావంత్ డ్రెస్ చూపరులకు తీవ్ర ఇబ్బందిని కలిగించిందనే చెప్పాలి! ఇక నరేంద్ర మోడీ అభిమానులకైతే ఒకింత ఆగ్రహం కూడా తెప్పించింది. ఆ పార్టీకి ఒక కురచ గౌను వేసుకొచ్చిన రాఖీ.. ఆ డ్రెస్ పై నరేంద్ర మోడీ బొమ్మలను ముందూ వెనకా అతికించుకోవడం సంచలనంగా మారింది. ఇలా ఓ దేశ ప్రధాని ఫోటోలను డ్రెస్ పై అతికించుకోవడమే కాక పబ్లిక్ గా ప్రదర్శన ఇవ్వడం.. మోదీనే కాక, ఏకంగా దేశాన్నే అవమానించినట్లని కొందరు రాఖీ సావంత్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే.
అయితే ఆ వివాదం సద్దుమణిగిపోయిందని రాఖీ అండ్ కో అనుకుంటున్న దశలో... ఇది మళ్లీ తెరమీదికొచ్చింది. అసభ్యకరమైన దుస్తులు ధరించారన్న కారణంగా నటి రాఖీ సావంత్ పై రాజస్థాన్ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదుచేశారు. రాజసమండ్ జిల్లా కాంక్రోలీ పోలీస్ స్టేషన్ లో నమోదుచేసిన కేసు వివరాలను ఆ స్టేషన్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. కాంక్రోలీకి చెందిన ఒక వ్యక్తి ఇచ్చిన ఫిద్యాదుమేరకు రాఖీ సావత్ పై కేసు నమోదుచేశామని, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు చెప్పారు. ఈ విషయంపై రాఖీ ఇంకా స్పందించలేదు!
కాగా... ఈ విషయంపై గతంలో అమెరికన్ మీడియాతో మాట్లాడిన రాఖీ సావంత్... "బీజేపీని ఆకట్టుకోవాలని.. ముఖ్యంగా మోడీ - అమిత్ షా దృష్టిలో పడాలని ఈ డ్రెస్ ధరించాను. వీరిద్దరినీ నేను విపరీతంగా అభిమానిస్తాను.. నేను ఇప్పటికే బీజేపీ కూతుర్ని.. రాజ్ నాథ్ సింగ్ నన్ను కూతురిలా భావిస్తారు.. కేవలం మోడీని ఇంప్రెస్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఫొటోలతో డ్రెస్ డిజైన్ చేయించుకున్నాను.. ఆయన నా డ్రీమ్ మ్యాన్. మరో 15 ఏళ్లు ఆయన ప్రధానిగా ఉంటారు" అని తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/