Begin typing your search above and press return to search.
మెగాస్టార్ షో పై ఎఫ్‌ఐఆర్ నమోదు.. నిషేదంకు డిమాండ్
By: Tupaki Desk | 3 Nov 2020 5:30 AM GMTబాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబచ్చన్ నిర్వహించే రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్ పతి ప్రస్తుతం 12వ సీజన్ జరుగుతోంది. కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా ఈ సీజన్ మొదలు అయ్యింది. ఈ షో ప్రతి సీజన్ కూడా వార్తల్లో ఉంటూనే వస్తుంది. అయితే ఈసారి ఒక వివాదం కారణంగా వార్తల్లో నిలిచింది. అందులో అడిగిన ఒక ప్రశ్న కారణంగా షో నిర్వాహకులు మరియు అమితాబచ్చన్ పై కేసు నమోదు అయ్యింది.
పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. మత విద్వేశాలను రెచ్చ గొట్టే విధంగా ఆ ప్రశ్న ఉంది అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలతో జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న షో ను నిషేదించాల్సిందే అంటూ కొందరు బాయ్ కాట్ కేబీసీ అంటూ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఇంతటి వివాదంకు కారణం అయిన ఆ ప్రశ్న ఏంటీ అంటే... డిసెంబర్ 25 1927లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ మరియు ఆయన మద్దతుదారులు ఒక గ్రంధంను కాల్చి వేశారు. ఆ గ్రంథం ఏంటీ అంటూ సెల్రబెటీలు అయిన అనూప్ సోని మరియు బెజ్వాడా విల్సన్ లకు అమితాబ్ వేశాడు. వారు వెంటనే మనుస్మృతి అంటూ చెప్పేశారు.

వారు సమాధానం చెప్పిన తర్వాత అమితాబ్ మాట్లాడుతూ అంబేద్కర్ కుల వివక్షకు వ్యతిరేకంగా ఆ పని చేశారు అంటూ వివరణ ఇచ్చారు. ఆ ప్రశ్న మరియు బిగ్ బి వివరణ హిందూ ప్రజల మనో భావాలను దెబ్బ తీసే విధంగా ఉంది అంటూ కేసు నమోదు అయ్యింది. ఈ వివాదంపై బిగ్ బి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.