Begin typing your search above and press return to search.
ఐదు రోజుల్లో సన్నీ మీద 3వ కేసు
By: Tupaki Desk | 24 May 2015 1:30 PM GMTఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లుంది ఈ సీన్. దేశంలో ఇంకెవ్వరూ ఇప్పటివరకు అస్సలు ఎక్స్‌పోజింగే చేయనట్లు, అసలు ఏ హీరోయినూ ఒక ఐటెం బాంబులా అందాలు ఎప్పుడూ చూపించనట్లు, వాటిని మనం గూగుల్‌లో ఎప్పుడూ చూపించనట్లు.. మనోళ్ళు నానా రచ్చ చేస్తున్నారు. అందరూ కలసి సన్నీ లియోన్‌నే టార్గెట్ చేస్తున్నారు.
మొన్న ఒకావడి సరదాగా ఫోన్లో సన్నీ అని టైప్ చేసి సునీల్ గవాస్కర్ గురించి తెలుసుకుందామని అనుకుంటే అందులో సన్నీ లియోన్ ఫోటోలు ఓపెన్ అయ్యాయట. పైగా అవి చాలా నీచాతినీచంగా ఎక్స్‌పోజింగ్‌తో కూడినవి కావడంతో పిల్లలు చెడిపోతారని భావించి వెంటనే సన్నీ లియోన్‌పై యాక్షన్ తీసుకోవాలని ఆ ఇల్లాలు కేసు పెట్టేసింది. అదే కోవలో కర్ణాటకలోని ఓ ఆంటీ కూడా సన్నీ వలన దేశ కల్చర్ నాశనమవుతోంది అంటూ ఎఫ్ఐఆర్ బుక్ చేయించేసింది. ఇక్కడితో ఆగలేదు ఈ రచ్చ. ఇప్పుడు రాజస్థాన్‌లో ఓ పెద్దాయనకు సన్నీ ఇబ్బంది కలిగించిందట.
ఒక మ్యాగజైన్ కొన్న పెద్దాయన అందులో సన్నీ ఫోటోలు చూసి అసభ్యకరమైనవిగా ఫీలయ్యాడు. సదరు మ్యాగజైన్ వెబ్సైట్లో అలాంటి ఫోటోలు ఇంకా చాలానే ఉండటంతో, ఆ మ్యాగజైన్‌పై, గూగుల్ సిఇఓపై, సన్నీ లియోన్‌పై ఐపిసి 292 క్రింద అజ్మీర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేశాడు. అసలు వీళ్ల బాధంతా సన్నీ లియోన్ తన శృంగారభరితమైన ఎక్స్‌పోజింగ్‌తో దేశాన్ని పాడుచేస్తోందనా లేకపోతే అలా ఒళ్ళు చూపించేసి ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిందనే ఏడుపా?