Begin typing your search above and press return to search.

'అదా' సినిమాపై ఎఫ్‌ఐఆర్ నమోదు

By:  Tupaki Desk   |   10 Nov 2022 12:30 PM GMT
అదా సినిమాపై ఎఫ్‌ఐఆర్ నమోదు
X
హిందీ చిత్రం 'కేరళ స్టోరీ' చుట్టూ వివాదం రాజుకుంటుంది. హార్ట్‌ ఎటాక్ బ్యూటీ అదా శర్మ ప్రధాన పాత్రలో సుదీప్తో సేన్ దర్శకత్వంలో రూపొందిన ది కేరళ స్టోరీ సినిమా యొక్క టీజర్‌ ను తాజాగా విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ విడుదల అయిన వెంటనే వివాదం మొదలు అయ్యింది. కేరళ పరువుకు భంగం కలిగించే విధంగా సినిమా ఉంటుందని టీజర్ ను చూస్తేనే అర్థం అవుతుందని కేరళ జనాలు వాదిస్తున్నారు.

కేరళ రాష్ట్రంకు చెందిన అమ్మాయిలు ఎంతో మంది నర్స్ లుగా మారి అప్ఘనిస్తాన్ తో పాటు పలు దేశాలకు సేవ చేసేందుకు వెళ్తున్నారు. ఆ సమయంలో కొందరు కేరళకు చెందిన వారు అమ్మాయిలను ముస్లీంలు గా మార్చి అఫ్ఘాన్ కి పంపిస్తున్నారు అంటూ టీజర్ లో అదా శర్మ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తాను అఫ్ఘన్ దేశపై జైలులో ఒక ఉగ్రవాది మాదిరిగా ఉన్నట్లుగా పేర్కొంది. ఆ వీడియో ప్రస్తుతం కేరళ లో తీవ్ర దుమారం కలిగిస్తుంది. మొత్తం 32 వేల మంది కేరళకు చెందిన అమ్మాయిలు అఫ్ఘన్ లోని జైళ్లలో ఉగ్రవాదులుగా మగ్గుతున్నట్లుగా టీజర్ లో పేర్కొనడం అసలు వివాదంకు తెర తీసింది.

తప్పుడు లెక్కలు చెబుతూ కేరళ పరువు తీయడంతో పాటు.. కేరళ అమ్మాయిల గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు అంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి విజయన్‌ కి కొందరు ఫిర్యాదు చేయడం జరిగింది. అంతే కాకుండా డీజీపీ కి కూడా ఈ విషయమై ఫిర్యాదు చేయడం తో చిత్ర యూనిట్‌ సభ్యులపై ఎఫ్‌ ఐ ఆర్ నమోదు చేసినట్లుగా కేరళ పోలీస్ లు పేర్కొన్నారు.

అదాశర్మ తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులపై తీవ్రమైన విమర్శలు చేస్తూ కేరళ జనాలు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కల్పిత కథ అయినప్పటికి కూడా రాష్ట్రం పేరును ప్రకటించడంతో తీవ్రంగా రాష్ట్రంను అవమానించినట్లు అవుతుంది అంటూ కేరళ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా విడుదల అయ్యేనా లేదా అనేది చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.