Begin typing your search above and press return to search.
మహేష్ సెట్స్ లో ఏం జరగలేదంటున్నారే
By: Tupaki Desk | 2 Nov 2016 4:36 AM GMTనిన్న సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగిన అంశాల్లో ప్రధానమైనది ఓ ఫైర్ యాక్సిడెంట్. మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ సెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని.. దీపావళి టపాసులు కాలుస్తున్న సమయంలో ఫర్నిచర్ అంటుకోవడంతో.. కొంత విలువైన సామాగ్రి కూడా దగ్ధమైందని వార్తలు వచ్చాయి.
జూబ్లీహిల్స్ లో వేసిన ఓ సెట్ లో ఈ ప్రమాదం జరిగిందంటూ వచ్చిన వార్తలపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ వచ్చింది. అగ్ని ప్రమాదం వార్తలు అన్నీ రూమర్లే అని.. ఎటువంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు. ఎటువంటి ప్రమాదం జరగలేదని.. ప్రస్తుతం కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ షూటింగ్ యధావిధిగా చేస్తున్నామని తేల్చేశారు. రెండు వారాల పాటు ఇక్కడ షూటింగ్ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగుతుందని కూడా చెప్పారు.
అయితే అంతర్గతంగా చెప్పుకుంటున్న వెర్షన్ వేరే ఉంది. అగ్నిప్రమాదం జరిగిన మాట వాస్తవమే అయినా.. అది చాలా చిన్నది మాత్రమే అని.. భారీ ఆస్తి నష్టం సంభవించలేదని.. అందుకే దీన్ని పెద్దదిగా చేసి అభిమానులను కంగారు పెట్టడం ఇష్టం లేక.. అసలేమీ జరగలేదని చెబుతున్నారనే టాక్ కూడా ఉంది. ఏది వాస్తవమైనా.. ఆస్తి నష్టం., ప్రాణనష్టం జరగలేదని చెబుతున్నారు కాబట్టి.. ఈ ఫైర్ యాక్సిడెంట్ ని పెద్దగా పట్టించుకోవాల్సిన పనేమీ లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/