Begin typing your search above and press return to search.
తామెందుకు అంత అప్పులు పాలైంది చెప్పి కన్నీరు పెట్టుకున్న రోజా
By: Tupaki Desk | 12 Sep 2021 3:38 AM GMTసరదాగా సాగే కార్యక్రమం ఒక్కసారిగా గంభీరమైంది. ఎప్పుడూ చలాకీగా ఉండే ఆర్కే రోజా జీవితంలోని బాధలు.. కష్టాల గురించి ఆమె వెల్లడించటమే కాదు.. తాము అప్పుల పాలైపోవటానికి కారణం తాజాగా ఒక ప్రోగ్రాంలో వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా ఒక చానల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె గతంలోకి వెళ్లారు. ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.
రాజకీయ ప్రత్యర్థులకు తన మాటలతో చుక్కలు చూపించే రోజా కంట కన్నీరు ఆ ప్రోగ్రాంలో పాల్గొన్న వారిని కదిలించింది. ఆమె పడిన కష్టాలు విని.. ఎమోషనల్ అయ్యారు. పోగ్రాంలోని వారు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. తన చిన్ననాటి కబుర్లను సరదాగా చెప్పటం మొదలు పెట్టిన రోజా.. తమకు డబ్బు.. భోజనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావన్నారు. తన తండ్రికి సినిమా అంటే ఎంతో ఇష్టమని.. నిర్మాతగా ఆయన ఎంతో నష్టపోయారన్నారు.
ఆయన నిర్మాతగా ఒక సినిమాలో తనను హీరోయిన్ గా పరిచయం చేశారని.. అప్పట్లో తనకు డ్యాన్స్ చేయటం రాదని.. డైలాగ్స్ చెప్పటం రాదని బాగా ఏడిపించేవారన్నారు. అలాంటి వేళలో చాలా బాధపడ్డానని.. ఒక దశలో సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోవాలని అనుకున్నట్లు చెప్పారు.
అందరూ తనను కామెంట్లు చేస్తుంటే ఫోటో షూట్ కోసం చెన్నైకి వెళ్లానని.. అక్కడ తనకు సెల్వమణి తీసిన ‘చామంతి’ మూవీలో అవకాశం వచ్చిందన్నారు. తన లక్ కొద్దీ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదన్నారు. సెల్వమణితో పెళ్లి ఓకే అనుకున్న తర్వాత.. తన అన్నను బాగా సెటిల్ చేయాలని ‘సమరం’ సినిమా చేశానని.. దాంతో తమ జీవితాలు మొత్తం సినిమా టైటిల్ కు తగ్గట్లు మారిపోయినట్లు చెప్పారు. సినిమా ప్లాప్ కావటంతో అప్పులపాలయ్యమని.. వాటిని తీర్చటం కోసం 2002 వరకు అప్పులు కడుతూనే ఉన్నామన్నారు.
తర్వాత సెల్వాతో పెళ్లి జరిగిందని.. పెళ్లికి ముందే తనకు పిల్లలు పుట్టరని చెప్పటంతో తానుచాలా బాధపడ్డానని.. తనకే ఎందుకిలా జరిగిందని బాగా ఏడ్చినట్లు చెప్పారు. కొంతకాలానికి తమకు పాప పుట్టిందని.. తన కుమార్తెను దేవుడిచ్చిన వరంలా భావిస్తానని చెప్పారు. అందుకే తన కుమార్తె అంటే తనకు చాలా ఇష్టమన్నారు. తన గతంలోకి వెళ్లిన రోజా.. ఆ విషయాల్ని షేర్ చేసుకునే వేళలో.. ఎమోషనల్ అయి.. కంట కన్నీరు పెట్టుకున్నారు. ఆమె రియల్ స్టోరీ విన్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు.