Begin typing your search above and press return to search.

మాచర్ల నియోజక వర్గంలో ఫస్ట్ ఎటాక్ ముహూర్తం ఖరారు

By:  Tupaki Desk   |   27 March 2022 12:52 PM GMT
మాచర్ల నియోజక వర్గంలో ఫస్ట్ ఎటాక్ ముహూర్తం ఖరారు
X
నితిన్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా కేథరిన్ తెర్సా కీలక పాత్రలో రూపొందుతున్న చిత్రం మాచర్ల నియోజక వర్గం. ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ గా కనిపించబోతున్నట్లుగా ఇటీవలే చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అధికారిక ప్రకటన వచ్చింది. నితిన్ హోం బ్యానర్‌ లో ఈ సినిమా ను రూపొందిస్తున్నారు. సినిమాలో నితిన్‌ ఫస్ట్‌ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరిగాయి.

సినిమా ఫస్ట్‌ లుక్ కు వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా నుండి మరో అప్‌డేట్‌ ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సిద్దం అయ్యారు. మాచర్ల నియోజక వర్గం చిత్రం నుండి ఫస్ట్‌ ఎటాక్ ను మార్చి 30వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఈ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఫస్ట్‌ ఎటాక్ అంటే ఏమై ఉంటుంది అనేది ఇప్పుడు చర్చ.

సినిమాకు సంబంధించిన నితిన్‌ ఫస్ట్‌ గ్లిమ్స్ అయ్యి ఉంటాయని.. ఈ పోస్టర్ ను చూస్తుంటే యాక్షన్‌ సన్నివేశాన్ని చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు విభిన్నంగా ప్రచారం చేసే ఉద్దేశ్యంతో ఇలాంటి ప్రయోగాత్మక వీడియోలను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సినిమా కు మంచి బజ్ ఉంది.

చిత్ర యూనిట్ సభ్యులు విభిన్నంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చేయడం ద్వారా అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి అనడంలో సందేహం లేదు. నితిన్‌ కు ఈ సినిమా సక్సెస్ అత్యంత కీలకంగా మారింది. ఆయన గత చిత్రాలు నిరాశ పర్చడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. కరోనా సమయంలో బ్యాక్ టు బ్యాక్‌ వచ్చిన నితిన్‌ కు కాస్త ఊరట దక్కింది. కాని కమర్షియల్‌ బ్రేక్ మాత్రం దక్కలేదు.

అందుకే ఈ సినిమా పై ఆయన మరియు ఆయన అభిమానులు ఆశలు పెట్టుకుని ఉన్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్లను దక్కించుకుంటుంది... ఏమేరకు జనాలను ఆకట్టుకోగలుగుతుంది అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే. సమ్మర్‌ పూర్తి అయ్యి పెద్ద సినిమాల హడావుడి తగ్గిన తర్వాత ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. సినిమా నుండి ఈనెల 30వ తారీకున రాబోతున్న ఫస్ట్‌ ఎటాక్ తో అంచనాలు ఎంతగా పెరుగుతాయి అనేది చూడాలి.